
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ రెండు జాతీయ అవార్డులు గెలుచుకుని వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మేనమామ, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ జీవీకి ఒక అమూల్యమైన బహుమతిని ఇచ్చారు. రెహమాన్ వాడిన తెల్లటి పియానోను అందుకున్న జీవీ తన ఆనందాన్ని పంచుకున్నారు.
Key Points
జీవీ ప్రకాష్ ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, స్టార్ హీరోగా రాణిస్తున్నారు.
'సూరరై పొట్రు' మరియు 'వాతి' సినిమాలకు గాను ఆయన రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.
మేనమామ ఏఆర్ రెహమాన్, జీవీకి తన ఎంతో ఇష్టమైన తెల్లటి పియానోను బహుమతిగా ఇచ్చారు.
రెహమాన్ వాడిన ఈ పియానోను జీవీ తన జీవితంలో అమూల్యమైన, మర్చిపోలేని బహుమతిగా భావిస్తున్నారు.
జీవీ ప్రకాష్ సంగీత, సినీ ప్రస్థానం
జీవీ ప్రకాశ్ ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, స్టార్ హీరో కూడా. అయితే జీవీ ప్రకాశ్ తన సినిమా ప్రయాణం, మేనమామ ఏఆర్ రెహమాన్ సంగీతంలో ‘జెంటిల్‌మేన్’ సినిమాలో పాట పాడి తన జర్నీ స్టార్ట్ చేశాడు. 2006లో ‘వెయిల్’ సినిమాతో సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ అరంగేట్రం చేశారు.
మొదటి సినిమాతోనే జీవీ ప్రకాష్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు జీవీ. ఇక 2015లో ‘డార్లింగ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు జీవీ ప్రకాష్. ఈ సినిమా భారీ విజయం సాధించింది.
జాతీయ అవార్డులు: రెహమాన్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి
నటుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్న జీవీ ప్రకాష్, ‘వాతి’ సినిమాకు రెండో జాతీయ అవార్డు అందుకున్నారు. దీనికి తన మామ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బహుమతి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇంతకీ మామ ఇచ్చిన అద్భుతమైప బహుమతి ఏంటి?
ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్‌కు ఎంతో ఇష్టమైన, తాను వాడిన తెల్లటి పియానోను బహుమతిగా ఇచ్చారు. ఎన్నో హిట్ పాటలకు రెహమాన్ వాడిన ఈ పియానో జీవీకి అమూల్యమైనది. ఇది తన జీవితంలో మర్చిపోలేని విలువైన బహుబతి అంటున్నాడు జీవీ.
ఏఆర్ రెహమాన్ పియానో ప్రత్యేకత, జీవీ భావోద్వేగం
జీవీ ప్రకాష్, 2020లో సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ సినిమా సంగీతానికి తన మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఆతరువాత అతనికి అవకాశాలు భారీగా పెరిగిపోాయాయి. ఈక్రమంలో రీసెంట్ గా మరో జాతీ అవార్డ్ అందుకోవడంతో రెహమాన్ తన మేనల్లుడికి ఇలా బహుమతి పంపించాడు. ఇక తాజాగా జీవీ ప్రకాష్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఏఆర్ రెహమాన్ తన మేనల్లుడు జీవీ ప్రకాష్‌కు ఇచ్చిన ఈ పియానో కేవలం ఒక వాయిద్యం కాదు. అది సంగీత వారసత్వానికి, అపారమైన ప్రేమకు ప్రతీక. జీవీ ఈ బహుమతిని తన జీవితంలో అమూల్యమైనదిగా భావించి, అందుకున్న ఆనందాన్ని పంచుకున్నారు.


