
📌 Key Points
- తారకరత్న మరణం తర్వాత మొదటిసారిగా అలేఖ్య ఎమోషనల్ ఇంటర్వ్యూ!
- తారక్ పేరెంట్స్ తమ ప్రేమను అంగీకరించలేదని అలేఖ్య ఆవేదన వ్యక్తం.
- పిల్లల కోసమైనా దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్న అలేఖ్య.
- కళ్యాణ్ రామ్ అన్నయ్య ఫ్రెండ్ లా ఉండేవారని, బాల బాబాయ్ మాత్రమే టచ్‌లో ఉన్నారని వెల్లడి.
నందమూరి తారకరత్న మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. ఆయన మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య మొదటిసారిగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె అనేక సంచలన విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
తారకరత్నతో ప్రేమ గురించి అలేఖ్య
Alekhya Tarakratna : నందమూరి తారకరత్న 2023 ఫిబ్రవరిలో మరణించారు. ఆయన మరణం తర్వాత తారకరత్న భార్య అలేఖ్య అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తుంది. తారకరత్న మరణం తర్వాత బయటకు రాని అలేఖ్య మొదటిసారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో అలేఖ్య అనేక విషయాలు మాట్లాడింది. వీరి ప్రేమని తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదని అందరికి తెలిసిందే. ఆ విషయంపై కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
కుటుంబం నుండి ఎదురైన ఇబ్బందులు
అలేఖ్య మాట్లాడుతూ.. తారక్ ని మొదట హైదరాబాద్ లోనే కలిసాను. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన అందర్నీ మన అని కలుపుకుంటారు. అప్పటికే నేను డైవర్స్ తీసుకున్నాను ఫస్ట్ మ్యారేజ్ నుంచి. నేను అసలు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా కానీ అతను కన్విన్స్ చేసాడు. నాన్నకు తారక్ ముందే తెలుసు. తననే వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడమన్నాను. ముందు ఒప్పుకోకపోయినా ఒక నెలరోజులకు ఓకే అన్నారు. మా పేరెంట్స్ ఒప్పుకున్నా వాళ్ళ సైడ్ ఒప్పుకోలేదు. అది మేము ఊహించలేదు.
పిల్లల భవిష్యత్తుపై అలేఖ్య ఆవేదన
నేను మా మామయ్య , అత్తమ్మ అని యాక్సెప్ట్ చేశాను కానీ వాళ్ళు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. పెద్దవాళ్ళు కదా అలాగే ఉంటుంది. నా మీద కోపం ఉంటుంది వాళ్లకు. ఏదో ఒకరోజు పిల్లల్ని దగ్గరకు తీసుకుంటారు అనుకుంటున్నాను. నేను చాలా సార్లు వాళ్లకు దగ్గరవ్వాలని ప్రయత్నించాను. నేను పాజిటివ్ గానే ఉన్నాను. నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితో కాంటాక్ట్ లో లేను. ఒకప్పుడు కళ్యాణ్ అన్న ఫ్రెండ్ లా ఉండేవాడు. ఒక్క బాల బాబాయ్ మాత్రం ఉంటారు మా కోసం. ఆయనకు మా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. నాకున్నదాంట్లో నేను పిల్లలని పెంచగలను కానీ తారక్ పేరెంట్స్ కూడా వాళ్ళని దగ్గరకు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అదొక్కటే నా కోరిక అని చెప్తూ ఎమోషనల్ అయింది.
అలేఖ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై నందమూరి కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


