
📌 Key Points
- వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా, దర్శకురాలిగా రాణిస్తున్నారు.
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో విలన్ పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
- దర్శకురాలిగా ‘సరస్వతి’ అనే సినిమాను వరలక్ష్మి తెరకెక్కించారు.
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వరలక్ష్మి ఎమోషనల్గా మాట్లాడారు, గోపీచంద్ మలినేని తన జీవితంలో ఒక పునర్జన్మనిచ్చారని అన్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారుతూ ‘సరస్వతి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. గోపీచంద్ మలినేని తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అని ఆమె అన్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ప్రస్థానం
Varalakshmi Sarathkumar:విలక్షణ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశం తలుపు తట్టలేదు. కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించినా.. ఆ చిత్రాలు పెద్దగా గుర్తింపును అందించలేదు. దీంతో తన రూట్ మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హీరోయిన్గా వర్కౌట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో విలన్ గా నటించి.. మొదటి సినిమాతోనే ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.
ముఖ్యంగా తెలుగులో విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి లక్కీ లేడీగా కూడా మారిపోయింది. అలాంటి ఈమె తాజాగా దర్శకురాలిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘సరస్వతి’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు..ఈ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు , డైరెక్టర్ గోపీచంద్ మలినేని గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది.
‘సరస్వతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశేషాలు
గోపీచంద్ మలినేని గురించి వరలక్ష్మి భావోద్వేగ ప్రసంగం
సరస్వతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ కూడా ఫిమేల్ రైట్స్ కోసం నిలబడతానని అందరికీ తెలుసు. అయితే ఇది కూడా అలాంటి సినిమానే. గోపీచంద్ మలినేని వల్లే తెలుగులో నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది. ఆయనే నాకు పునర్జన్మని ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. అందుకే ఎమోషనల్ అవుతున్నాను. ఇది రియల్ గా చాలా మంచి సినిమా.. ప్రమోట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాము. ఈ సినిమాను కచ్చితంగా చూడండి . ముఖ్యంగా ఇండస్ట్రీలో మహిళలు ఎదగడానికి హెల్ప్ చేయండి .సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను. కానీ ఈరోజు అయ్యాను. మహిళలు ఏడుపుని క్యారీ చేస్తారు.. నేను ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయి కోసం నిలబడ్డానికి ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయిగా ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టం” అంటూ ఎమోషనల్ అయ్యింది వరలక్ష్మి శరత్ కుమార్. మొత్తానికైతే అటు నటిగా ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు దర్శకురాలిగా ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టింది మరి ఈ ప్రయాణం వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎలాంటి గమ్యానికి చేరుస్తుందో చూడాలి.
మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా, దర్శకురాలిగా తన సత్తా చాటుతున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ‘సరస్వతి’ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఆమె ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుందాం.

