
వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో మరో ఛాలెంజింగ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘పోలీస్ కంప్లైంట్’ అనే హారర్ థ్రిల్లర్‌లో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Key Points
వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.
‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ కాన్సెప్ట్‌తో హారర్ థ్రిల్లర్.
కృష్ణ గారి సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ సినిమాలో ఉంది.
నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త పాత్ర
రొటీన్ క్యారెక్టర్స్‌కు దూరంగా ఉంటూ తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్‌లోనే కనిపిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా మరో డిఫరెంట్ రోల్‌లో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె హీరోయిన్ గా పోలీస్ కంప్లైంట్ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పోలీస్ ఆఫీసర్ గా ఖాకీ డ్రెస్‌లో రివాల్వర్ పట్టుకొని పవర్‌ఫుల్ లుక్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపిస్తోంది. ఈ మూవీలో సీరియస్, కామెడీ కలబోతగా వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు. పోలీస్ కంప్లైంట్ మూవీ కోసం దివంగత హీరో కృష్ణగారి ఓ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేసినట్లు తెలిపారు. కృష్ణ సాంగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ కాన్సెప్ట్
పోలీస్ కంప్లైంట్ మూవీలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్నాడు. కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సంజీవ్ మేగోటి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆదిపర్వం, రాఘవరెడ్డి, పౌరుషంతో పాటు మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు సంజీవ్ మేగోటి.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందని కాన్సెప్ట్ తో, హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ ఈ మూవీ సాగుతుంది. సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది” అని చెప్పారు.
సినిమా విశేషాలు
నిర్మాతలు సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ..,”వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తున్న పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. యాక్షన్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తె లుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించబోతున్న ఈ చిత్రానికి “పోలీస్ కంప్లైంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశాం” అని అన్నారు.
హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. తెలుగులో క్రాక్, కోటబొమ్మాళితో పాటు మరికొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ చేసింది. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో మూడు సినిమాలు చేస్తోంది.
‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం యాక్షన్, హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.


