
📌 Key Points
- నటి వరలక్ష్మి శరత్‌కుమార్ పిల్లల్ని కనే ఉద్దేశం లేదని వెల్లడించారు.
- న్యూ ఇయర్ వేళ ఈ సంచలన ప్రకటన చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
- కేవలం జన్మనివ్వడం కాదు, ప్రేమ, బాధ్యతలే నిజమైన అమ్మతనం అని ఆమె అభిప్రాయం.
- అవసరమైన వారికి తల్లిలా ఉంటానని, భవిష్యత్తులో తన ఆలోచన మారొచ్చని వరలక్ష్మి తెలిపారు.
నూతన సంవత్సరం వేళ టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సంచలన ప్రకటన చేశారు. పిల్లల్ని కనే ఉద్దేశం లేదంటూ ఆమె వెల్లడించారు. అమ్మతనంపై తనదైన శైలిలో నిర్వచనం చెప్పిన వరలక్ష్మి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ ప్రకటన వెనుక ఉన్న కారణాలు, ఆమె ఆలోచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ నిర్ణయం
Tollywood:వివాహమైన ప్రతి అమ్మాయి అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంత పరితపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజలను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగిన తర్వాత తమ జీవితంలో మాతృత్వం అనే మాధుర్యమైన సమయాన్ని గడపాలని తెగ ఎదురుచూస్తూ ఉంటారు.. అటు సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్ లు కాబట్టి వారు పెళ్లిళ్లు చేసుకుంటే చాలు ఎప్పుడు శుభవార్త చెబుతారు అని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నిస్తూ ఉంటారు నెటిజన్స్. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం కొత్త సంవత్సరం వేళ షాకింగ్ నిర్ణయాన్ని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar). గత ఏడాది ప్రేమ పెళ్లి చేసుకున్న ఈమె.. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పిల్లలను కనే ఆలోచన తనకు లేదంటూ స్పష్టంగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..” అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిల్లల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పి అందరి దృష్టిని ఆశ్చర్యపరిచింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వెనుక ఉన్న ఆంతర్యం తెలిసి కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
అమ్మతనంపై వరలక్ష్మి అభిప్రాయం
మీరు చెప్పింది నిజమే.. తల్లి అనేది పిల్లల్ని కనగానే తల్లి అయిపోరు. కేవలం జన్మనివ్వడమే కాదు ప్రేమ, బాధ్యత, త్యాగం ఉండాలన్నదే నిజమైన అమ్మతనం అంటూ ఆమె అభిప్రాయపడింది అని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా వరలక్ష్మీ శరత్ కుమార్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయం అభిమానులను పూర్తిగా నిరాశకు గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నేను పిల్లల్ని కని తల్లి అవ్వాలనుకోవడం లేదు. కానీ నా చెల్లికి ఒక తల్లిగా ఉంటాను. నా పెంపుడు కుక్కలకు, పిల్లలకు, నా స్నేహితులకు, అవసరంలో ఉన్న వారికి అందరికీ కూడా నేనొక తల్లిలా ఉండి, వారిని ఆదుకుంటాను ” అంటూ తెలిపింది.
అవసరమైన వారికి తోడుగా నిలవడమే తన దృష్టిలో అసలైన అమ్మతనం అంటూ కూడా వివరించింది.. ఇకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చు అని.. ఒకవేళ ఆ సందర్భంలో తనకు పిల్లలను కనాలనే ఆలోచన వస్తే దానిని కూడా తాను అంగీకరిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు గతంలో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కానీ కాలక్రమేనా ఆలోచన మారడం వల్లే పెళ్లి చేసుకున్నానని కాబట్టి భవిష్యత్తులో పిల్లలను కనే ఆలోచన వస్తే అప్పుడు పిల్లల్ని కంటాను అని కూడా చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.
అభిమానుల స్పందన: మద్దతు, నిరాశ
వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికి వస్తే.. ఈమె అప్పటికే పెళ్లయి పెళ్లీడుకొచ్చిన ఒక అమ్మాయి ఉండి విడాకులు తీసుకున్న నికోలయ్ సచ్ దేవ్ తో ప్రేమలో పడి, మరీ వివాహం చేసుకుంది. అయితే తన వివాహ సమయంలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ. అయితే నికోలయ్ మాత్రం తన భార్యపై ఉన్న ప్రేమను చూపిస్తూ.. ఏకంగా నికోలయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్ దేవ్ గా తన పేరును మార్చుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్న ఈ జంటపై అభిమానులు ఎప్పటికప్పుడు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ పిల్లలు వద్దంటూ చేసిన ప్రకటన, అమ్మతనంపై ఆమెకున్న ప్రత్యేక అభిప్రాయాలు అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి. భవిష్యత్తులో ఆమె మనసు మారే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ నిర్ణయంపై చర్చ కొనసాగుతోంది.


