|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసి”కి షాక్! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్!

Published: 29-05-2026, 6:31 AM
వారణాసి"కి షాక్! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్!
  • రాజమౌళి “వారణాసి” అంటార్కిటికా షెడ్యూల్ మరోసారి వాయిదా, ఫ్యాన్స్‌లో ఉత్కంఠ.
  • మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా, ప్రస్తుతానికి పక్కన పెట్టిన షూట్.
  • నెల రోజుల యాక్షన్ షెడ్యూల్ ప్లాన్, రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ సిద్ధం.
  • ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కీలక పాత్రలు, 2027 ఏప్రిల్ 7న రిలీజ్.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న “వారణాసి” చిత్రంపై ఊహించని అప్‌డేట్! పాన్-వరల్డ్ స్థాయిలో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా షూటింగ్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచే ఈ వార్త టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

అంటార్కిటికా షెడ్యూల్‌కు బ్రేక్!

Varanasi : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారాణసి సినిమాపై పాన్ వరల్డ్ హైప్ తెప్పించారు. ఒక్క టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ప్రియాంక చోప్రా కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఉగ్రభట్టి గుహల ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఈ గుహల్లోనే చిన్నమస్తాదేవి ఉన్నట్టు వారణాసి టైటిల్ గ్లింప్స్ లో చూపించారు. ప్రస్తుతానికి ఆ సెట్ లో ఉండే సీన్స్ షూటింగ్ పూర్తయింది.

రాజమౌళి కొత్త ప్లాన్.. యాక్షన్ మోత!

ఈ సినిమాలో అంటార్కిటికా ఎపిసోడ్ కూడా ఉండటంతో అంటార్కిటికాకు కూడా వెళ్లి షూటింగ్ చేయాలని ప్లాన్ చేసారు. సమ్మర్ మొదట్లోనే వెల్దామనుకున్నారు. ఇందుకోసం మహేష్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కానీ ఏమైందో ఈ షెడ్యూల్ వాయిదా పడింది. అంటార్కిటికి అంత చల్లదనంలో సమ్మర్లో వెళ్లి షూటింగ్ చేద్దామని మే లో ప్లాన్ చేసారు రాజమౌళి.

వారణాసి రిలీజ్ డేట్‌పై ప్రభావం ఉంటుందా?

కానీ ఈసారి కూడా అంటార్కిటికా షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసారట రాజమౌళి. ప్రస్తుతం అంటార్కిటికా షెడ్యూల్ పక్కన పెట్టి నెల రోజుల పాటు సాగే ఒక షూటింగ్ షెడ్యూల్, అందులో 2 యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట రాజమౌళి. త్వరలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. మరి వారణాసి మూవీ యూనిట్ అంటార్కిటికాకు ఎప్పుడు వెళ్తారో చూడాలి.

“వారణాసి”పై రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మహేష్ బాబు అభిమానులు ఈ కొత్త షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.