|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సృష్టి! రాజమౌళి సంచలనం, బడ్జెట్ ఎంతో తెలుసా?

Published: 09-01-2026, 4:15 AM
రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సృష్టి! రాజమౌళి సంచలనం, బడ్జెట్ ఎంతో తెలుసా?
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ వారణాసి సెట్ కోసం దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
  • ఈ సెట్​ను మోహన్ బింగి, సందీప్ సువర్ణ ఆధ్వర్యంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ రూపొందించింది.
  • సినిమా కోసం రాజమౌళి దాదాపు 1300 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం భారీ వారణాసి సెట్ వేశారు. దీనికోసం దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సెట్ నిర్మాణం

Varanasi Movie: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుందని తెలియగానే ఆ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇలా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. రాజమౌళి డైరెక్షన్లో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు హాలీవుడ్ స్థాయిలో మారుమోగుతుంది. ఇక ఈ సినిమా అనంతరం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

మరొక ఆరు ఏడు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ఇటీవల స్వయంగా రాజమౌళి ఈ సినిమా అప్డేట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కీలక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుందని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో వారణాసి నగరంలో చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాల కోసం రాజమౌళి వారణాసి వెళ్లకుండా రామోజీ ఫిలిం సిటీలోనే వారణాసి సెట్ వేసినట్టు తెలుస్తుంది. వారణాసి నగరాన్ని మొత్తం అచ్చుగుద్దినట్టు సెట్ వేశారట. ఈసెట్ కోసం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ సమాచారం.

సెట్ కోసం భారీగా ఖర్చు చేసిన రాజమౌళి

వారణాసిలో చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాలకు సంబంధించి టెంపుల్స్ తో పాటు కొన్ని ఘాట్స్ అలాగే వారణాసిలో ఉండే వీధులు అన్నింటినీ అచ్చు గుద్దినట్టు డిజైన్ చేశారట ఈసెట్ వేయడం కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతోందని, ఈ సెట్ మొత్తం మోహన్ బింగి, సందీప్ సువర్ణ వేశారని తెలుస్తోంది. వీరిద్దరూ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్స్ గా కూడా పనిచేస్తున్నారు. ఇలా ఈ సినిమా కోసం రాజమౌళి రామోజీ ఫిలిం సిటీకే వారణాసిని రప్పించారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రాజమౌళి సినిమాలో సెట్ అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ బాహుబలి మాహిష్మతి సెట్  ప్రేక్షకుల సందర్శనార్థం అలాగే ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాహిష్మతి తరహాలోనే వారణాసి సెట్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇలా ఈసెట్ కోసమే 50 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ బడ్జెట్ తో మంచి సినిమా చేయొచ్చు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. వారణాసి కోసం రాజమౌళి ఏకంగా 1300 కోట్లు బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా అదనంగా మరో రెండు వందల కోట్లు కేవలం ప్రమోషన్లకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కే ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలో షూటింగ్ పూర్తి కానున్న వారణాసి మూవీ

మొత్తానికి రాజమౌళి వారణాసి సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.