
📌 Key Points
- మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
- హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్, ప్రియాంక చోప్రాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
- తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ జార్జియాకు వెళ్లనుంది, అక్కడ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారు.
- ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వి రాజ్ కుంభగా నటిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే చిత్ర యూనిట్ జార్జియాకు పయనమవుతోంది. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
హైదరాబాద్‌లో ‘వారణాసి’ షూటింగ్ షురూ!
Varanasi Shooting : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు., దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.. హైదరాబాదులోని కోకాపేట్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు అక్కడే షూటింగ్ జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. అక్కడ మహేష్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్లను షూట్ చెయ్యనున్నారని తెలుస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ 15 రోజుల షెడ్యుల్ వేరోచోట జరగనుంది. మరి ఆ వివరాలను కాస్త తెలుసుకుందాం..
సూపర్ స్టార్ మహేష్ వారణాసి కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది.. ఈ షెడ్యూల్ అయిన వెంటనే చిత్ర యూనిట్ విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ నెల ఆఖరున మూవీ టీమ్ జార్జియా వెళ్లనుంది.. అక్కడ దాదాపు 15 రోజులు షూటింగ్ జరగనుందని సమాచారం.. ఇక జార్జియాలో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా అక్కడ షూట్ చేయనున్నారు. జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు.. రాజమౌళి మార్క్ మేకింగ్ తో, హాలీవుడ్ ప్రమాణాల తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే.. ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..
జార్జియాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్!
రాముడిగా మహేష్.. మందాకినిగా ప్రియాంక!
మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో రాముడు పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినీ’ క్యారెక్టర్ లో నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వి రాజ్ ‘కుంభ’ క్యారెక్టర్లో నటిస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిత్రానికి భారీ మొత్తంలో కేవలం ప్రమోషన్స్ కోసమే కేటాయించినట్టు ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.. 75 కోట్లు కేవలం ప్రమోషన్స్ కే కేటాయించబోతున్నారని గట్టిగా వినపడుతున్న టాక్. ఈ విధంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని గ్లోబల్ రేంజ్ లో ప్రమోషన్స్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియట్ అయ్యాయి.. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..
మొత్తానికి ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


