|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: గన్లతో బెదిరింపులు! మాఫియాతో గొడవతో ఇల్లు వదిలిన వరుణ్ ధావన్ ఫ్యామిలీ!!

Published: 28-03-2026, 8:35 AM
షాకింగ్: గన్లతో బెదిరింపులు! మాఫియాతో గొడవతో ఇల్లు వదిలిన వరుణ్ ధావన్ ఫ్యామిలీ!!
  • బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కుటుంబానికి మాఫియా బెదిరింపులు!
  • 90లలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్న వరుణ్ ధావన్.
  • మాఫియా బెదిరింపుల వల్ల ఇల్లు ఖాళీ చేసి వేరే చోట తలదాచుకున్న హీరో కుటుంబం.
  • షాకింగ్ ఘటనను ‘యువా’ ఇంటర్వ్యూలో వెల్లడించిన వరుణ్ ధావన్.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కుటుంబానికి ఊహించని కష్టం! మాఫియా బెదిరింపులతో వరుణ్ ధావన్ ఫ్యామిలీ మొత్తం ఇల్లు వదిలి పారిపోయారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే చూడండి.

వరుణ్ ధావన్ ఫ్యామిలీకి మాఫియా బెదిరింపులు ఎందుకు?

Varun Dhawan Reveals Mafia Threat And Leaves House: పూరి జగన్నాథ్ గోలీమార్ సినిమా తరహాలోనే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కుటుంబానికి జరిగింది. 90వ దశకంలో బాలీవుడ్‌ను వణికించిన అండర్ వరల్డ్ మాఫియా సెగలు తన కుటుంబాన్ని కూడా తాకాయని, తన తండ్రికి వచ్చిన ఫోన్ కాల్స్ గురించి వరుణ్ ధావన్ వివరించారు.

90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అండర్ వరల్డ్ నీడలో మగ్గిపోయేది. షారుఖ్ ఖాన్ , రాకేష్ రోషన్, కరణ్ జోహార్ వంటి హేమాహేమీలకు కూడా మాఫియా నుంచి బెదిరింపులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

90లలో బాలీవుడ్ ను వణికించిన మాఫియా కథ.

తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ‘యువా’ (Yuvaa) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబం ఎదుర్కొన్న ఒక భయానక, వింతైన అనుభవాన్ని పంచుకున్నారు. అండర్ వరల్డ్ బెదిరింపుల కారణంగా తమ ఇల్లు వదిలి ఒక రోజంతా వేరే చోట తలదాచుకోవాల్సి వచ్చిందని వరుణ్ ధావన్ పేర్కొన్నారు.

“‘నువ్వు ఎవడవైతే మాకేంటి? దమ్ముంటే ఆ గార్డెన్‌లోకి రా.. నిన్ను కొట్టి చూపిస్తా’ అని మా పనిమనిషి వాళ్లకు సవాల్ విసిరేవాడు. అంతేకాదు, మా ఇంటి అడ్రస్ కూడా వాళ్లకు చెప్పేసి రమ్మని పిలిచేవాడు” అని నవ్వుతూనే ఆనాటి గందరగోళాన్ని గుర్తు చేసుకున్నారు హీరో వరుణ్ ధావన్.

ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ షాకింగ్ విషయాలు.

“అతను మా ఆఫీస్ టైమింగ్స్, అడ్రస్ అన్నీ వాళ్లకు తెలిసిపోయాయని చెప్పాడు. దీంతో ఆ రోజు రాత్రే మేమంతా ఇల్లు వదిలి వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాము. ఇప్పుడు చెప్పుకోవడానికి ఇది వింతగా అనిపించినా, అప్పుడు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాము” అని వరుణ్ ధావన్ వివరించారు.

వరుణ్ ధావన్ కుటుంబానికి జరిగిన ఈ సంఘటన బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.