|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వరుణ్ తేజ్ ‘బరి’: గెలుస్తాడా? లేక గత సినిమాల ఫలితమే పునరావృతమవుతుందా?

Published: 28-03-2026, 6:05 AM
వరుణ్ తేజ్ 'బరి': గెలుస్తాడా? లేక గత సినిమాల ఫలితమే పునరావృతమవుతుందా?
  • వరుణ్ తేజ్ కొత్త సినిమా వాలీబాల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
  • నిహారిక కొణిదెల నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
  • గత సినిమాల ఫలితాల దృష్ట్యా ఈ సినిమాపై మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
  • సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు, పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

వరుణ్ తేజ్ వాలీబాల్ నేపథ్యంలో ‘బరి’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, గత సినిమాల ఫలితాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వాలీబాల్ కోర్టులో వరుణ్ తేజ్

బాక్సింగ్ రింగులో (గని).. ఆకాశంలో (ఆపరేషన్ వాలెంటైన్).. గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో (మట్కా).. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి బొక్క బోర్లా పడ్డ వరుణ్ తేజ్ ఇపుడు వాలీబాల్ గేమ్ పై కన్నేశాడు. యస్ .. కమిటీ కుర్రోళ్లు అంటూ సెన్సిబుల్ సినిమా తీసి మంచి హిట్ కొట్టిన యదు వంశీ దర్శకత్వంలో,చెల్లెలు నిహారికా కొణిదెల ప్రొడక్షన్ లో వాలీబాల్ గేమ్ బ్యాక్ డ్రాప్ లో బరి అంటూ కొత్త సినిమాని పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వడంతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

నిహారిక తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పై తన అన్నయ్యతో సినిమా చేయాలన్న కోరికను ఈ సినిమాతో తీర్చేసుకుంటుంది.ఇక చెల్లెలి మాట కాదనలేక వరుణ్ కూడా ఓకే చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది కాని ఈ సినిమా రిజల్ట్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ కి టెన్షన్ తప్పడం లేదు. గత కొంతకాలంగా వరుస ప్లాప్ సినిమాలతో సక్సెస్ అడ్రస్ పట్టుకోలేక పోతున్నాడు వరుణ్.ఇపుడు రూరల్ స్పోర్ట్స్ డ్రామా అంటూ వస్తున్న ఈ కథలో కొత్తదనం ఎంత ఉందన్నది మెగా ఫ్యాన్స్ రైజ్ చేస్తున్న డౌట్స్.అయితే సక్సెస్ లో లేడు కాబట్టి పెద్ద డైరెక్టర్స్ చాన్సులు రాక ఇలా ఒక హిట్ కొట్టిన డైరెక్టర్ అయినా చాలనుకుని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ కూడా వినిపిస్తుంది.

“బాడీ మేకోవర్ ఓకే .. మరి బాక్సాఫీస్ మేకోవర్ ఎప్పుడు?”

నిర్మాతగా నిహారిక కొణిదెల

అయితే ఈ సినిమాలో వాలీబాల్ ప్లేయర్ గెటప్ కోసం వరుణ్ తేజ్ మళ్ళీ బాడీని పెంచే పనిలో పడ్డాడట. బాడీని కష్టపెట్టి అథ్లెట్ లా మార్చడం వరుణ్‌కు కొత్తేమీ కాదు. గతంలో ‘గని’ కోసం ఇలాగే సిక్స్ ప్యాక్ చేసి నానా హంగామా చేశారు కూడా .. కానీ థియేటర్లోకి వచ్చాక ఒక్కరు కూడా ‘గని’ని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఇప్పుడు వాలీబాల్ కోర్టులో స్మాష్‌లు కొట్టడానికి ప్రాక్టీస్ చేస్తున్న మెగా హీరోకు, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల స్మాష్‌లు మేరకు కొడతాడో అంటూ అప్పుడే ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు.ఇక మరికొందరు అడుగు ముందుకేసి “బాడీ మేకోవర్ ఓకే అన్నయ్యా.. మరి బాక్సాఫీస్ మేకోవర్ ఎప్పుడు?” అంటూ ఓపెన్ గానే సెటైర్లు వేసే పనిలో పడ్డారు.

వచ్చే పొంగల్ బరిలోనే దించడానికి ప్లాన్

ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే మేమెందుకు తగ్గాలి అంటూ ఈ బరిని వచ్చే పొంగల్ బరిలోనే దించడానికి ప్లాన్ చేస్తున్నారట .అసలే సంక్రాంతి అంటే పెద్ద హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ మాములుగా ఉండదు. అలాంటి చోట ఒక స్పోర్ట్స్ డ్రామాతో, అదీ వరుస ఫెయిల్యూర్లలో ఉన్న హీరో పోటీకి దిగడం అంటే అది పెద్ద రిస్కే, మరి వరుణ్ తేజ్ ఏ ధైర్యంతో బరిలోకి దిగుతున్నారో ఆయనకే తెలియాలి.

ఇక సినిమా రిలీజ్ కాకముందే AI వీడియోలతో, టెక్నికల్ హంగామాతో హడావిడి చేస్తూ ఆడియన్స్ కి అప్ డేట్స్ ఇవ్వబోతున్నాడట డైరెక్టర్ యదు వంశీ.ఇక సూపర్ హిట్ అయిన ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్ మొత్తం ఇక్కడ ఉన్నా, వరుణ్ తేజ్ ఇమేజ్ కు తగిన కథ ఇది అవుతుందా? లేక పాత చింతకాయ పచ్చడిలాంటి రూరల్ డ్రామానేనా? అన్నది ఇక్కడ పెద్ద డౌట్. ‘సినిమాలో మేటర్ ఉంటె ఒకే . లేకపోతే మాత్రం ఆడియన్స్ ‘బరి’ దాటించి పంపించేయడం ఖాయం.

సంక్రాంతి బరిలో సినిమా విడుదల

వాలీబాల్ స్కిల్స్ vs బాక్సాఫీస్ మాస్ పల్స్

ఏది ఏమైనా సంక్రాంతి ‘బరి’లో నిలబడాలంటే కేవలం వాలీబాల్ స్కిల్స్ ఉంటే సరిపోదు.. బాక్సాఫీస్ దగ్గర మాస్ పల్స్ పట్టే కథ కూడా ఉండాలి!మరి వరుణ్ తేజ్ ఈ మాటని దృష్టిలో పెట్టుకొని ఈ వాలీబాల్ గేమ్ లో గెలిచి తన కెరీర్‌ను నిలబెట్టుకుంటాడో , లేక మరోసారి ‘మేకోవర్’ పేరుతో కాలక్షేపం చేస్తారో కాలమే డిసైడ్ చేయాలి.

మొత్తానికి వరుణ్ తేజ్ ‘బరి’ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. సంక్రాంతి బరిలో నిలవడం సినిమాకు కలిసొస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.