
మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానుల ఆనందం కోసం ఎదురుచూస్తున్న శుభవార్తను ప్రకటించారు. ఇటీవలే పండంటి బాబుకు జన్మనిచ్చిన ఈ జంట, తమ కొడుకు పేరును అధికారికంగా వెల్లడించారు. బారసాల వేడుక ఫోటోలతో పాటు, ప్రత్యేకమైన పేరు వివరాలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి.
Key Points
వరుణ్ తేజ్ – లావణ్య దంపతులు ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యుల మధ్య బారసాల వేడుక ఘనంగా జరిగింది.
తమ కొడుకు పేరును 'వాయువ్ తేజ్ కొణిదెల'గా ప్రకటించి, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు.
వాయువ్ తేజ్ కొణిదెలకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆశీస్సులు తెలుపుతున్నారు.
వరుణ్-లావణ్య కొడుకు పేరు ప్రకటన
Varun Tej Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023 లో పెళ్లి చేసుకోగా ఇటీవలే లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనించ్చినట్టు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. రెండు రోజుల క్రితమే ఈ బాబుకి బారసాల ఫంక్షన్ కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.
బారసాల వేడుక వివరాలు
Also See : Pawan Kalyan : జానీ గన్ తో పవర్ స్టార్ స్టైలిష్ పోజులు.. బ్లాక్ డ్రెస్ లో కళ్యాణ్ బాబు కల్ట్ లుక్స్.. ఆ స్వాగ్ చూడు తమ్ముడు..
‘వాయువ్ తేజ్’కు సెలబ్రిటీల ఆశీస్సులు
తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య తమ కొడుకు పేరుని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ బారసాల ఫోటోలను కూడా షర్ చేసారు. వరుణ్ తేజ్ లావణ్య తమ బాబు పేరుని వాయువ్ తేజ్ కొణిదెల అని ప్రకటించారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ వాయువ్ తేజ్ కి బ్లెస్సింగ్స్ తెలుపుతున్నారు.
వరుణ్ తేజ్, లావణ్యల కొడుకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా ఫ్యామిలీలో కొత్త అతిథి రాకతో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ వార్త అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.


