
📌 Key Points
- దర్శకుడు వశిష్ట ‘బింబిసారా’తో విజయం సాధించి, ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.
- వశిష్ట తన తదుపరి సైన్స్ ఫిక్షన్ కథను రవితేజకు వినిపించగా, ఆయన నటించడానికి అంగీకరించారు.
- మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో ఇది మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో నటిస్తున్న సినిమా.
- ఈ కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ 2026 ద్వితీయార్థం నుండి ప్రారంభం కానుంది.
బింబిసారా దర్శకుడు వశిష్ట, విశ్వంభర సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజతో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నారు. రవితేజ కెరీర్‌లో ఇది తొలి సైన్స్ ఫిక్షన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ 2026 ద్వితీయార్థం నుండి మొదలు కానుంది.
వశిష్ట ప్రస్థానం: బింబిసారా నుండి విశ్వంభర దాకా
Vassishta : బింబిసారా సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ వశిష్ట (Vassishta). కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈయన తదుపరి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కిన విశ్వంభర (Vishwambhara)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వశిష్ట మరొక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథను లాక్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కథను రవితేజకు వినిపించగా రవితేజ కూడా ఈ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారని ఇండస్ట్రీ సమాచారం. ఇప్పటివరకు రవితేజ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నటించలేదు. ఇలా సరికొత్త జోనర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ విన్న రవితేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం వశిష్ట ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2026 ద్వితీయార్థం నుంచి షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్టు సమాచారం.
రవితేజతో తొలి సైన్స్ ఫిక్షన్ వివరాలు
రవితేజ హిట్టు ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ నిరాశ ఎదుర్కొన్నారు. త్వరలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
శివ నిర్వాణ సినిమా పనులలో రవితేజ..
కొత్త సినిమా షూటింగ్ ఎప్పటినుంచంటే?
ఈ సినిమా ప్రమోషన్లలో రవితేజ బిజీగా ఉంటూనే మరోవైపు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు .ఈ సినిమా తండ్రీ కూతురి నేపథ్యంలో ప్రేక్షకుల ముందు రాబోతుందని ఈ సినిమాకు “ఇరుముడి” అనే టైటిల్ కూడా పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి . ఇంకా ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు. తాజాగా వశిష్ట రవితేజ కాంబోలో రాబోతున్న సినిమా గురించి కూడా వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే అధికారకంగా వెల్లడించాల్సి ఉంది.
రవితేజ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో వశిష్ట రాక ఖచ్చితంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. విశ్వంభర తర్వాత వశిష్ట నుండి, కొత్త జోనర్‌లో రవితేజ నుండి రాబోతున్న ఈ చిత్రం సినీ అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది.


