
‘దేవి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా ‘వసుదేవ సుతం’ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ధర్మ హింసా నేపథ్యంలో సాగే ఈ కథాంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Key Points
'దేవి' ఫేమ్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా 'వసుదేవ సుతం' సినిమా తెరకెక్కుతోంది.
హీరో సత్యదేవ్ చేతుల మీదుగా 'వసుదేవ సుతం' తెలుగు టీజర్ విడుదలైంది.
ధర్మం కోసం నిలబడే వ్యక్తిగా, నిధి కోసం ప్రయత్నించే కథాంశంతో సినిమా రానుంది.
ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, ఒరియా భాషల్లో విడుదల కానుంది.
‘వసుదేవ సుతం’: మాస్టర్ మహేంద్రన్ కొత్త అవతార్
Vasudheva Sutham : ‘దేవి’ సినిమా ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్, సౌత్ లో అనేక సినిమాల్లో నటించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా, నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వసుదేవ సుతం’. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Vasudheva Sutham)
గతంలో వసుదేవ సుతం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ని రిలీజ్ చేశారు. హీరో సత్యదేవ్ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే హీరో ధర్మం కోసం నిలబడే వ్యక్తిగా, అలాగే ఓ నిధి కోసం కొంతమంది ప్రయత్నించే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
సత్యదేవ్ ఆవిష్కరించిన ‘వసుదేవ సుతం’ టీజర్
మీరు కూడా వసుదేవ సుతం టీజర్ చూసేయండి..
పాన్ ఇండియా స్థాయిలో ‘వసుదేవ సుతం’ విడుదల
వసుదేవ సుతం సినిమాని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంబికావాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, భధ్రమ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాబోతున్న ‘వసుదేవ సుతం’ టీజర్ మంచి స్పందనను అందుకుంది. సినిమా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ పాన్ ఇండియా చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


