|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈరోజే వట సావిత్రి వ్రతం.. ఏ సమయానికి పూజ చేయాలో తెలుసుకోవడంతో పాటు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి!

Published: 26-05-2025, 12:21 AM
ఈరోజే వట సావిత్రి వ్రతం.. ఏ సమయానికి పూజ చేయాలో తెలుసుకోవడంతో పాటు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి!

మే 26, 2025న వట సావిత్రి వ్రతం. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతానికి సంబంధించిన పూజా సమయం, విధానం, నియమాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

మే 26, 2025న వట సావిత్రి వ్రతం.

2

అభిజిత్ ముహూర్తంలో పూజలు చేయడం శ్రేష్ఠం.

4

మర్రిచెట్టు పూజ, ఉపవాసం ప్రధాన అంశాలు.

వట సావిత్రి వ్రతం 2025: శుభ సమయం

వివాహిత స్త్రీలు 26 మే 2025 సోమవారం నాడు వట సావిత్రిని ఆరాధించనున్నారు. మర్రిచెట్టును దారంతో కట్టి తన భర్త దీర్ఘాయుష్షు కోసం వరం కోరుతారు. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో చాలా ఆర్భాటంగా, విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

భర్త దీర్ఘాయువు, సుఖ సంతోషాలు , సౌభాగ్యం కోసం వివాహిత స్త్రీలు భరణి, కృతికా నక్షత్రం, శోభన, అతిగండ యోగంలో పూజలు చేయాలని జ్యోతీష నిపుణులు తెలిపారు. ఈ సమయంలో స్త్రీలు త్రిమూర్తులను (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) పూజిస్తారు.

మర్రిచెట్టులో బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుడు (శివుడు) నివసిస్తున్నారని నమ్ముతారు. మర్రిచెట్టు కిందే సావిత్రి యమరాజును ఎదుర్కొని తన భర్త ప్రాణాలను కాపాడింది. ఈ రోజున ఉపవాసం ఉన్న మహిళలకు సోమవారం అమావాస్య కావడంతో సోమావతి అమావాస్య పుణ్యం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా వివాహిత స్త్రీల భర్తల దుష్ట, హానికరమైన గ్రహాలు శాంతిస్తాయి.

అమావాస్య తిథి ప్రారంభం: మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు

అమావాస్య తిథి ముగింపు: మే 27 ఉదయం 08:31

వట సావిత్రి వ్రతం: పూజా విధానం

కృతికా నక్షత్రం: మే 26 ఉదయం 8:23 నుంచి మే 27 వరకు ఉదయం 5:32 గంటలకు.

సోమవారం ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.14 గంటల వరకు అభిజిత్ ముహూర్తంలో పూజలు చేయడానికి ఉత్తమ సమయం.

వట సావిత్రి వ్రతం ఎందుకు చేయాలి?

వట సావిత్రి వ్రతం ఆచరించడం వలన భర్త ఆయుష్షు పెరుగుతుంది, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈరోజు కొన్ని ప్రత్యేక నియమాలతో పూజ చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఎంతో మంచిది. వట సావిత్రి వ్రతం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వట సావిత్రి వ్రతం: చేయాల్సింది, చేయకూడనిది

ఈసారి వట సావిత్రి వ్రతం మే 26న వచ్చింది. ఈరోజు కొన్ని ప్రత్యేక నియమాలతో పూజ చేయడం వలన సంతోషకరమైన వైవాహిక జీవితం కలుగుతుంది. వట సావిత్రి వ్రతం నాడు వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కలగాలని ఉపవాసం చేస్తారు. ఈరోజు మర్రిచెట్టుని ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

వట సావిత్రి వ్రతం నాడు ఏం చేయకూడదు?

వట సావిత్రి వ్రతం నాడు ఏం చేయాలి?

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

వట సావిత్రి వ్రతాన్ని సక్రమంగా ఆచరించడం ద్వారా దంపతుల మధ్య అనుబంధం పెరుగుతుంది. నియమాలను పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.