|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘వీరమల్లు’ ఫేక్‌.. విజయ మిల్క్‌ ఎండీ కౌంటర్‌

Published: 19-07-2025, 3:40 AM
'వీరమల్లు' ఫేక్‌.. విజయ మిల్క్‌ ఎండీ కౌంటర్‌

‘వీరమల్లు’ సినిమా విడుదలకు ముందు, పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న అతి ప్రచారం వివాదానికి దారితీసింది. విజయ మిల్క్ ప్యాకెట్లపై సినిమా పోస్టర్లు అంటించడంతో వివాదం మొదలైంది. ఈ ఘటనపై విజయ డైరీ ఎండీ స్పందించారు.

Key Points

1

వీరమల్లు సినిమా ప్రచారానికి ఫ్యాన్స్ విజయ మిల్క్ ప్యాకెట్లను ఉపయోగించారు.

2

విజయ డైరీ ఎండీ ఈశ్వర్ బాబు ఈ ప్రచారాన్ని తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు.

4

బుర్జ్ ఖలీఫా మీద పోస్టర్, విమానాల ప్రచారం వంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

విజయ మిల్క్ ప్యాకెట్లపై వీరమల్లు పోస్టర్లు

‘ హరి హర వీరమల్లు ‘ రేంజ్ ‌ ఇదంటూ .. మా హీరోకు మరోకరు పోటీ లేరని పవన్ ‌ కల్యాణ్ ‌ అభిమానులు సోషల్ ‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు . జులై 24న సినిమా విడుదల కానుంది. మూవీకి పెద్దగా బజ్‌ లేకపోవడంతో మొన్న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద ‘ హరి హర వీరమల్లు ‘ పోస్టర్‌ అంటూ ఫేక్ ‌ ప్రచారం అందుకున్నారు . ఇప్పుడు ఏకంగా ఎయిరిండియా, ఇండిగో విమానాలకు వారి పిచ్చి అభిమానం తాకింది . అంతటితో ఆగని ఫ్యాన్స్ ‌ బస్సులు , విజయ పాల ప్యాకెట్లు , వాటర్ ‌ బాటిల్స్ ‌, బింగో చిప్స్ ‌ ఇలా ఏదీ వదలడం లేదు . ఇదంతా వీరమల్లు ఇమేజ్ ‌ అంటూ పవన్ ‌ కల్యాణ్ ‌ ఖాతాలో వేస్తున్నారు . అయితే , నెటిజన్లు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు . ఇకనైనా మారండ్రా అంటూ విమర్శలు చేస్తున్నారు . తాజాగా విజయ డైరీ ఎండీ ఈశ్వర్ ‌ బాబు రెస్పాండ్ ‌ అయ్యారు .

ఎండీ ఈశ్వర్ బాబు స్పందన

విజయవాడ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ మిల్క్ ‌ కు 60 ఏళ్ల చరిత్ర ఉంది . దక్షిణ భారత్‌లోనే టాప్‌లో ఉన్న సంస్థగా గుర్తింపు ఉంది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ దినదినాభివృద్ధి చెందుతుంది . అయితే , ఆ సంస్థ అనుమతి లేకుండా విజయ మిల్క్ ‌ ప్యాకెట్లపై హరి హర వీరమల్లు పోస్టర్ ‌ అంటూ సోషల్ ‌ మీడియాలో వైరల్ ‌ చేస్తున్నారు . సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫొటోలు కూడా వైరల్ కావడంతో వివాదం మొదలైంది. దీంతో తాజాగా విజయ డైరీ ఎండీ రియాక్ట్ ‌ అయ్యారు . అదంతా తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టిపడేశారు . నిబంధనలకు విరుద్దంగా ఇలా చేయడం నేరం అని ఆయన పేర్కొన్నారు . బాగా పాపులర్ ‌ అయిన విజయ బ్రాండ్ ‌ ను వాడుకోవడానికి వారి అభిమానుల్లో ఎవరైనా ఇలా ఎడిట్ ‌ చేసి ఉంటారని ఈశ్వర్ ‌ బాబు తెలిపారు . ఎప్పటికీ తమ సంస్థ మరోక బ్రాండ్ ‌ ను ప్రచారం చేయదని క్లారిటీ ఇచ్చారు .

నెటిజన్ల విమర్శలు

వీరమల్లు బజ్ ‌ కోసం సోషల్‌మీడియాలో పవన్ ‌ కల్యాణ్ ‌ అభిమానులు ఎంచుకుంటున్న అడ్డదారులపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు . ఇలాంటి తప్పుడు దారిలో ప్రచారం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని దుమ్మెత్తిపోస్తున్నారు . తెలుగు పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి . కానీ , ఇలాంటి ఫేక్ ‌ ప్రచారం మాత్రం ఎవరు చేసుకోలేదని విమర్శిస్తున్నారు . ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పనేనని కొందరు గట్టిగానే చెబుతున్నారు . ఇలాంటి ఫేక్ బతుకు ఎందుకంటూ మండిపడుతున్నారు. అయితే , పవన్ ‌ ఫ్యాన్స్‌తో పాటు జనసేన శతఘ్ని సోషల్‌మీడియా ఖాతా నుంచి ఒక వివరణ వచ్చింది. ఇదంతా పవన్ ‌ ‌ మీద కోపంతో కొందరు కావాలని ఇలా మార్ఫింగ్ చేసి పోస్టులు చేస్తున్నారని రాజకీయ రంగు పూసేందుకు తెర లేపింది. కానీ , సదరు పోస్టర్ ‌ లను వైరల్ ‌ చేస్తున్న వారి సోషల్ ‌ మీడియా ఖాతాలను వారు ఒకసారి చెక్ ‌ చేస్తే అసలు రంగు ఏంటో తెలుస్తుందని గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఆ పేజీలన్నీ పవన్ ‌ కల్యాణ్ ‌ అభిమానులవే అని క్లియర్ ‌ గా తెలిసిపోతుంది .

వీరమల్లు సినిమా ప్రచారం వివాదాలకు దారితీసింది. అభిమానుల అతిగా ఉండే ప్రచారం సరైనదా కాదా అనేది చర్చనీయాంశంగా మారింది. విజయ మిల్క్ కంపెనీ స్పందనతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.