|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘వీరమల్లు’కు జీఎస్‌టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?

Published: 04-09-2025, 1:43 AM
'వీరమల్లు'కు జీఎస్‌టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?

పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు సినిమా భారీ నష్టాలను చవిచూసింది. నిర్మాత ఏఎం రత్నం జీఎస్టీ చెల్లించలేకపోయినా టికెట్ల ధరలు పెంచడానికి అనుమతి లభించడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఈ అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Key Points

1

వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

2

నిర్మాత ఏఎం రత్నం రూ. 60 కోట్లకు పైగా నష్టపోయారు.

4

పేర్ని నాని ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

వీరమల్లు సినిమా నష్టాలు

పవన్ కళ్యాణ్ హీరోగా నటించి హరి హర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ‌ కావడతో సుమారు రూ . 60 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి . దీంతో నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది . కనీసం తమకు జీఎస్ ‌ టీ అయినా చెల్లించాలని నిర్మాతను బయ్యర్లు డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి. తాను కూడా నష్టపోయానని సంబంధం లేదని తేల్చిచెప్పినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు . సుమారు రూ . 18 కోట్ల జీఎస్ ‌ టీలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది . ఇప్పుడు ఇదే అంశాన్ని సినిమాటోగ్రఫీ మాజీ మంత్రి పేర్ని నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

జీఎస్‌టీ బిల్లు లేకుండానే అనుమతి హరి హర వీరమల్లు టికెట్ల రేట్లు పెంపు , జీఎస్ ‌ టీ అంశం గురించి పేర్ని నాని ఇలా అన్నారు . ‘ ఏపీలో సినిమా టికెట్ ‌ ధరల పెంపు అంశంలో మాజీ సీఎం జగన్ ‌ మోహన్ ‌ రెడ్డి తెచ్చిన జీఓ ప్రస్తుత ప్రభుత్వం కొట్టివేయలేదు . కానీ , దానిని పాటించకుండా వారికి ఇష్టం వచ్చనట్లు ధరలు పెంచుకుంటూ పోతున్నారు . హరిహర వీరమల్లు సినిమాకు ఒక్క జీఎస్టీ ప్రూఫ్ ‌ కూడా ఇవ్వకుండా కేవలం తెల్లకాగితంతో నిర్మాత వెళ్లితే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు . ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు . అందరికీ నీతులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ ‌ కల్యాణ్ ‌ కు ఇది తప్పనిపించలేదా .? అందరిని ప్రశ్నిస్తానని చెప్తాడు .. కానీ , ఆయన్ను ప్రశ్నిస్తే తట్టుకోలేడు . సూక్తులు మాత్రమే చెప్తాడు .. వాటిని ఆయన ఎంత మాత్రం పాటించడు .’ అంటూ పేర్ని నాని పేర్కొన్నారు .

జీఎస్టీ చెల్లింపుల వివాదం

జగన్ ‌ ప్రభుత్వం తెచ్చిన జీఓ ఎందుకు రద్దు చేయలేదు ? సినిమా టికెట్ల ధరల విషయంలో జగన్ ‌ ప్రభుత్వం తెచ్చిన జీఓ గురించి నాని ఇలా అన్నారు . ‘ హీరో, హీరోయిన్, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ కాకుండా కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయ్యే భారీ బడ్జెట్‌ సినిమాలకు మాత్రమే టికెట్ ‌ ధరలు పెంచుకోవాలని మేము జీఓలో చెప్పాం . అందుకు సంబంధించిన జీఎస్టీ ప్రూఫ్స్ ‌ కూడా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది . అప్పుడు మాత్రమే టికెట్ ‌ ధరల పెంపునకు అనుమతి తీసుకోవాలని గతంలో మేము జీఓ జారీ చేశాం . బ్లాక్ ‌ టికెట్ల అమ్మకాలు నిలువరించేందుకు అడ్డుకట్ట వేశాం .

పేర్ని నాని విమర్శలు

దీంతో పవన్ ‌ కల్యాణ్ ‌ ఊగిపోయారు . సినిమాల కోసం తాము పెట్టుబడిపెట్టుకుని నిర్మించుకుంటే ప్రభుత్వ జోక్యం ఏంటి అంటూ ఆయన రెచ్చిపోయారు . తాము తెచ్చిన ప్రభుత్వ జీఓపై నోటికొచ్చింది మాట్లాడుతూ ఊగిపోయారు . కానీ , ఇప్పటికీ అదే జీఓను ఏపీ సినిమా పరిశ్రమలో ఎందుకు కొనసాగుతుంది ..?’ అని నాని ప్రశ్నించారు .

వీరమల్లు సినిమా విఫలం, జీఎస్టీ చెల్లింపుల వివాదం, ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.