|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ డీల్ క్లోజ్! రికార్డు ధర పలికిందంటూ వైరల్ న్యూస్!

Updated: 17-01-2026, 12:09 AM
షాకింగ్: వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' ఓటీటీ డీల్ క్లోజ్! రికార్డు ధర పలికిందంటూ వైరల్ న్యూస్!
  • వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫిక్స్: సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాత!
  • శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రం 2026 సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది!
  • నెట్‌ఫ్లిక్స్ ద్వారా ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ హక్కులు సొంతం: భారీ ధరకు డీల్ కుదిరినట్టు సమాచారం!
  • తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఓటీటీ డీల్ ఫిక్స్! ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేష్, త్రివిక్రమ్ మూవీ క్రేజీ అప్డేట్!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం. 47, ఎ.కె. 47’. దీనిని హారిక అండ్ హాసిని పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 2026 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ (OTT) డీల్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్(Netflix) అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘హౌస్ నెం. 47, AK 47లో గురూజీ మరియు వెంకటేష్‌తో మాస్‌ని కలుసుకున్న క్లాస్ .. ఆదర్శ కుటుంబం తెలుగు(Telugu), తమిళం(Tamilam), హిందీ(Hindi), మలయాళం(Malayalam) మరియు కన్నడ(Kannada) భాషలలో థియేటర్లలో విడుదలైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

నెట్‌ఫ్లిక్స్ చేతికి ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ హక్కులు!

2026 సమ్మర్ రిలీజ్: ఫ్యాన్స్ కి పండగే!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఓటీటీ డీల్ ఒక సంచలనం. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.