|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దృశ్యం 3: వెంకటేష్ సంచలనం! అక్టోబర్ నుండి షూటింగ్ ప్రారంభం! బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం!

Published: 21-01-2026, 3:15 AM
దృశ్యం 3: వెంకటేష్ సంచలనం! అక్టోబర్ నుండి షూటింగ్ ప్రారంభం! బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం!
  • వెంకటేష్ దృశ్యం 3 షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది.
  • సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
  • మలయాళంలో దృశ్యం 3 2026లో విడుదల కానుంది.
  • వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ మరోసారి తన అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. దృశ్యం 3 సినిమా షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేష్ సినిమాలతో బిజీ

Venkatesh: విక్టరీ వెంకటేష్ (Venkatesh).. ఫ్యామిలీ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తన సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గత ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి (Anil Ravipudi)!దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఈ ఏడాది మళ్లీ అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేశారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో కూడా వెంకటేష్ వెంకీ గౌడ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.పైగా ఈ సినిమా తక్కువ సమయంలోనే 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ హిట్ గా దూసుకుపోతోందని చెప్పవచ్చు.

దృశ్యం 3 అక్టోబర్ నుండి ప్రారంభం

ఇదిలా ఉండగా మరొకవైపు వెంకటేష్ తన వరుస సినిమాలతో స్పీడు మీద ఉన్నారు అని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. దృశ్యం 1, 2 చిత్రాలతో సంచలనం సృష్టించి, అందర్నీ ఆకర్షించిన వెంకటేష్.. మరోవైపు దృశ్యం 3 సినిమా షూటింగ్లో బిజీ కాబోతున్నారు. సురేష్ బాబు వెంకటష్ తో చేస్తున్న దృశ్యం3 సినిమా షూటింగ్ అక్టోబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇదే కాదు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దృశ్యం 3 షూటింగ్ ఈ అక్టోబర్లో ప్రారంభం అవుతుంది నిర్మాత దగ్గుబాటి సురేష్అంటూ ధృవీకరించారు.

ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరొకవైపు మలయాళం దృశ్యం3 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు మోహన్ లాల్. మొత్తానికైతే దృశ్యం సినిమాతోనే సంచలనం సృష్టించి.. తన పాత్రతో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్ ఇప్పుడు దృశ్యం 3 షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నారని తెలిసి అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందోనని ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్

ఇదిలా ఉండగా.. మరొకవైపు వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం:హౌస్ నెంబర్ 47’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు ప్రముఖ నారా హీరో రోహిత్ కూడా మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కామెడీ జానర్ లో రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తూ ఉండగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మొత్తానికి దృశ్యం సినిమాతో సంచలనం సృష్టించిన వెంకటేష్ ఇప్పుడు దృశ్యం 3 తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.