
📌 Key Points
- వరుస విజయాలతో వెంకటేష్ రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది.
- వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నారు.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, పూజా హెగ్డే కలిసి నటించనున్నారు.
- ‘ఆదర్శ కుటుంబం’ 2026 సమ్మర్ లో విడుదల కానుంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచారు. వరుస విజయాలు సాధించడంతో ఆయన పారితోషికం రెట్టింపు అయింది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.
రెమ్యూనరేషన్ పెంచిన వెంకటేష్
Venkatesh remuneration: టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల వెంకటేష్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ అవడంతో వెంకీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడితో మరో సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తుంది.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వెంకటేష్ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న ఈయన ఇప్పుడు తన రెమ్యూనరేషన్ డబల్ చేస్తూ 20 కోట్లకు పెంచారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) డైరెక్షన్లో చేయబోతున్న ఆదర్శ కుటుంబం సినిమాకు 20 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఆదర్శ కుటుంబం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. 2026 సమ్మర్ కి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ
ఇప్పటివరకు వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమా కూడా రాలేదు కానీ త్రివిక్రమ్ కథా రచయితగా పనిచేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలలో వెంకటేష్ నటించిన మంచి సక్సెస్ అందుకున్నారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈయన సినిమా చేయబోతుండడంతో ఈ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సందడి చేయబోతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదల అయితే అనంతరం వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా పనులలో బిజీ కానున్నారు.
వెంకటేష్ జోడిగా పూజ హెగ్డే..
అనిల్ రావిపూడితో మరో సినిమా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించి ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా 4 వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, మరొక 15 రోజులలో ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా పూజ హెగ్డే నటించబోతున్న నేపథ్యంలో వెంకటేష్ అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ అనిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకోబోతున్నారు.
వెంకటేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన తదుపరి చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


