
📌 Key Points
- విక్టరీ వెంకటేష్ సరసన కీర్తి సురేష్ ఫిక్స్, జోడీ అదిరిందంటున్న ఫ్యాన్స్!
- నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. సంక్రాంతికి సూపర్ హిట్ పక్కా!
- అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో 2027 సంక్రాంతికి విడుదల!
- వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటున్న సినీ విశ్లేషకులు!
టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది ఒక పండగ లాంటి వార్త! విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా, అంచనాలు భారీగా ఉన్నాయి.
కీర్తి సురేష్, వెంకటేష్ జోడీ ఎలా ఉండబోతోంది?
బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మల్టీస్టారర్ చిత్రం అనౌన్స్‌చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ కొత్త ప్రాజెక్టులో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట సందడి చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్‌కు కూడా జోడీ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఈ మేరకు ఇందులో కళ్యాణ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్ అయిందట. ఇక వెంకటేష్, కీర్తి సురేష్ – కళ్యాణ్ రామ్, కృతి శెట్టి సంక్రాంతి జోడీలు సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. త్వరలోనే దీనిపై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ రాబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతుండగా.. మంచి ప్లానే వేశాడు అనిల్ రావిపూడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాగే ఈ సినిమాతో అయిన యంగ్ బ్యూటీ కృతి శెట్టికి మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్రం 2027 సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. హిట్ పక్కానా?
సంక్రాంతికి అనిల్ రావిపూడి ట్రీట్.. బ్లాక్ బస్టర్ ఖాయమా?
వెంకటేష్, కళ్యాణ్ రామ్ ల మల్టీస్టారర్ మూవీ గురించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


