|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకీ అట్లూరి సంచలన ప్రకటన: విశ్వనాథన్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ లీక్! సూర్య ఫ్యాన్స్‌కు పండగేనా?

Published: 11-05-2026, 5:45 PM
వెంకీ అట్లూరి సంచలన ప్రకటన: విశ్వనాథన్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ లీక్! సూర్య ఫ్యాన్స్‌కు పండగేనా?
  • “విశ్వనాథన్ అండ్ సన్స్” విడుదల తేదీపై వెంకీ అట్లూరి 50 రోజుల గ్యాప్ హింట్ ఇచ్చారు.
  • ఈ సినిమా జూలై మూడో వారం లేదా చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
  • సూర్యను “సంజయ్ రామస్వామి” లా చూడబోతున్నామని వెంకీ అట్లూరి గతంలో తెలిపారు.
  • “వీరభద్రుడు” ప్రీ-రిలీజ్ వేడుకలో ఈ అప్డేట్ వెల్లడైంది, అంచనాలు భారీగా పెరిగాయి.

సూర్య నటిస్తున్న “విశ్వనాథన్ అండ్ సన్స్” విడుదల తేదీపై దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. “వీరభద్రుడు” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు అడగగా, 50 రోజుల గ్యాప్ తర్వాత సినిమా వస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో జూలైలో సినిమా రిలీజ్ ఖాయమని భావిస్తున్నారు.

వెంకీ అట్లూరి ఇచ్చిన హింట్ ఏంటి?

Veera Bhadrudu pre Release: కోలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సూర్య(Suriya) ఒకరు ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సూర్య నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతాయి. ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇక త్వరలోనే సూర్య నటించిన వీరభద్రుడు(Veera Bhadrudu) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా మే 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఆర్జె బాలాజీ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో మే 14వ తేదీ విడుదల కానుంది. తమిళంలో కరుప్పు అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వెంకీ అట్లూరి సూర్య గురించి వీరభద్రుడు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

విశ్వనాథన్ అండ్ సన్స్ పై అంచనాలు

ఈ నేపథ్యంలోనే అభిమానులు విశ్వనాథన్ అండ్ సన్స్ (Vishwanathan and sons)సినిమా విడుదల గురించి అప్డేట్ అడగడంతో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. మనం కూడా వద్దాం కానీ ఒక 50 రోజులు గ్యాప్ తీసుకుందాం.. కచ్చితంగా హిట్ కొడతాం అంటూ వెంకీ అట్లూరి ఈ సందర్భంగా విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమా విడుదల తేదీ గురించి అప్డేట్ ఇచ్చారు. ఇలా ఈయన ఒక 50 రోజులు గ్యాప్ తీసుకుందామంటూ మాట్లాడటంతో ఈ సినిమా జూలై మూడో వారం లేదా జులై చివరి వారంలో విడుదల కాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ వీడియో విడుదల చేయగా ఈ టీజర్ వీడియోకి ఎంతో మంచి ఆదరణ లభించింది.

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా..

వీరభద్రుడు ప్రీ-రిలీజ్ వేడుకలో..

విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమాలో సూర్యని మరో సంజయ్ రామస్వామి లాగా చూడబోతున్నాము అంటూ ఇదివరకు వెంకీ అట్లూరి తెలియజేశారు .ఇక వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో కార్తి కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అచ్చం సంజయ్ రామస్వామిని చూసినట్టే ఉందంటూ మాట్లాడటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక వీరభద్రుడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సూర్య జోడిగా త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.

వెంకీ అట్లూరి ఇచ్చిన క్లారిటీతో “విశ్వనాథన్ అండ్ సన్స్” సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. సూర్య అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.