
📌 Key Points
- హీరో కార్తికేయ భార్య లోహిత రెడ్డి కొత్తగా రెస్టారెంట్ ప్రారంభించారు.
- లోహిత ప్రారంభించిన రెస్టారెంట్ పేరు లోరీ, ఇది శంషాబాద్ సమీపంలో ఉంది.
- ఈ రిసార్ట్ ఆధునిక సౌకర్యాలతో వివాహాలు, వేడుకలకు అనువుగా రూపొందించబడింది.
- కార్తికేయ, లోహిత 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ భార్య లోహిత రెడ్డి ఒక శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఆమె హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో ‘లోరీ’ పేరుతో ఒక కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
లోహిత రెడ్డి నూతన వ్యాపారం
Karthikeya wife: సినీ నటుడు కార్తికేయ అంటే ఆలోచిస్తారు కానీ ఆర్ఎక్స్ 100 హీరో అంటే మాత్రం టక్కున గుర్తుకు వస్తారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమైన కార్తికేయ అనంతరం పలు తెలుగు సినిమాలలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ హీరోగా నటించిన వాలిమై అనే సినిమాకు ఈయన విలన్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇలా కథ ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటిస్తున్న కార్తికేయ ఇటీవల సినిమాల ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు.
ఇటీవల కాలంలో కార్తికేయ కొత్త సినిమాలను ప్రకటించలేదు. ఈయన 2024వ సంవత్సరంలో భజే వాయువేగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తికేయ నటించిన సినిమాలు పెద్దగా ఏవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇలా ఈయన కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే కార్తికేయ 2021 వ సంవత్సరంలో లోహిత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరూ కాలేజీ చదివే సమయంలోనే ప్రేమలో ఉంటూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
లోరీ రెస్టారెంట్ ప్రత్యేకతలు
పెళ్లి తర్వాత కూడా లోహిత పలు వ్యాపారాలను చూసుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా లోహిత రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఒక శుభవార్తను తెలియజేశారు. శుభవార్త అంటే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే.. లోహిత హైదరాబాదులో సరికొత్త రెస్టారెంట్ ప్రారంభించారని తెలుస్తోంది లోరీ అనే పేరుతో ఈమె రిసార్ట్ కన్వెన్షన్ ప్రారంభించారు ఇందుకు సంబంధించిన విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కార్తికేయ, లోహితల వివాహ జీవితం
ఈ రిసార్ట్ అన్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేయబడి ఉంది. పెళ్లిళ్లకు ఇతర వేడుకలకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఇక ఈ రిసార్ట్ హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా రెస్టారెంట్ బిజినెస్ లోకి ఈమె అడుగు పెట్టడంతో కార్తికేయ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా సంతోషంగా ఉన్న ఈ జంట తల్లిదండ్రులుగా ఎప్పుడు ప్రమోట్ కాబోతున్నారు? ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పు బోతున్నారు అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి లోహిత రెడ్డి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం కార్తికేయ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


