
📌 Key Points
- విశ్వక్ సేన్ సినిమాకు పోటీగా అర్జున్ సర్జా చిత్రం ‘సీతాపయణం’ విడుదల కానుంది.
- విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కాబోతోంది.
- ఒకప్పుడు విశ్వక్ ‘సీతాపయణం’ సినిమా నుంచి తప్పుకోవడంతో వివాదం జరిగింది.
- విశ్వక్, అర్జున్ ఒకరి సినిమాలకు ఒకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదే రోజు అర్జున్ సర్జా దర్శకత్వంలో ‘సీతాపయణం’ కూడా విడుదల కానుంది. గతంలో ఈ సినిమా నుండి విశ్వక్ తప్పుకోవడంతో వివాదం జరిగింది. ఇప్పుడు విశ్వక్ ఎలా స్పందించాడో చూద్దాం.
విశ్వక్ సేన్ సినిమా విడుదల
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen)నటించిన ఫంకీ (Funky)సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నాగ వంశీ నిర్మాణంలో అనుదీప్ డైరెక్షన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫిబ్రవరి 13వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా విశ్వక్ సేన్ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు ఈ నేపథ్యంలోనే మీడియా వారి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. విశ్వక్ సినిమాకు పోటీగా అర్జున్ సర్జా(Arjun Sarja) దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతాపయణం(Seetha Payanam) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా అర్జున్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విశ్వక్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, అవకాశం వస్తే విశ్వక్ తో సినిమా చేస్తానని తెలిపారు.
అర్జున్ ‘సీతాపయణం’ సినిమా
ఇలా విశ్వక్ సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేయడంతో ఈ విషయం గురించి హీరో విశ్వక్ తన సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ అర్జున్ గారు అలా చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది జీవితం అంటే ఇదే ఒకరోజు కోపం ఉంటే మరుసటి రోజు ప్రేమలు ఉంటాయి అంటూ ఈయన మాట్లాడారు అలాగే సీతా పయనం సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని విశ్వక్ సేన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా వీరిద్దరూ ఒకరి సినిమాల గురించి ఒకరు ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఆల్ ద బెస్ట్ చెప్పుకోవడంతో వీరిద్దరి మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేవని స్పష్టమవుతుంది.
సీతా పయనం నుంచి తప్పుకున్న విశ్వక్..
విశ్వక్, అర్జున్ మధ్య సఖ్యత
నిజానికి అర్జున్ దర్శకత్వంలో ఐశ్వర్య అర్జున్ నటించిన ఈ సినిమాలో విశ్వక్ హీరోగా నటించాల్సి ఉంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయిన తర్వాత విశ్వక్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అప్పట్లో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది. అయితే వీరిద్దరి సినిమాలు కూడా ఇప్పుడు ఒకేసారి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ ఇద్దరి హీరోలు ఒకరి సినిమాకు ఒకరు ఆల్ ద బెస్ట్ తెలియజేసుకోవడం గమనార్హం. ఇక అర్జున్ సైతం తనపై ఎలాంటి కోపం లేదని తనతో సినిమా చేయటానికి కూడా నేను రెడీ అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. మరి కొన్ని గంటలలో ఈ ఇద్దరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఏ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
ఒకప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ, విశ్వక్ సేన్ మరియు అర్జున్ సర్జా ఒకరి సినిమాలను మరొకరు ప్రోత్సహించుకోవడం పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇద్దరి సినిమాలు మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.


