|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య సినిమా సెట్‌లో చిరుతపులి బీభత్సం! దర్శకుడు వెంకీ అట్లూరి సంచలన విషయాలు!

Published: 24-03-2026, 1:35 PM
సూర్య సినిమా సెట్‌లో చిరుతపులి బీభత్సం! దర్శకుడు వెంకీ అట్లూరి సంచలన విషయాలు!
  • దర్శకుడు వెంకీ అట్లూరి ‘దీవాన’ సాంగ్ లాంఛ్‌కు హాజరయ్యారు.
  • సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా షూటింగ్ సమయంలో చిరుతపులి సెట్‌లోకి వచ్చింది.
  • ఊటీలోని ఫెర్న్‌హిల్ ప్యాలెస్‌లో షూటింగ్ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది.
  • చిరుతపులి ఒక కుక్కను చంపి తీసుకెళ్లిపోయిందని వెంకీ అట్లూరి తెలిపారు.

దర్శకుడు వెంకీ అట్లూరి సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక షాకింగ్ సంఘటనను వెల్లడించారు. ఊటీలోని ఫెర్న్‌హిల్ ప్యాలెస్‌లో షూటింగ్ జరుగుతుండగా చిరుతపులి సెట్‌లోకి ప్రవేశించింది.

‘దీవాన’ సాంగ్ లాంచ్ వేడుకలో వెంకీ అట్లూరి

Venky Atluri: సూర్య సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్‌లోకి చిరుతపులి వచ్చిందనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). తాజాగా ఆయన ‘శుభం’ ఫేమ్ హర్షిత్ రెడ్డి (Harshith Reddy) హీరోగా నటించిన ‘దీవాన’ (Deewana) మూవీ సాంగ్ లాంఛ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నేహ మణిమేగలై హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ‘ఇది ప్రేమ’ అనే సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వెంకీ అట్లూరిని హీరో హర్షిత్ రెడ్డి.. ‘మీ దీవాన మూమెంట్’ చెప్పాలని అడిగారు. అందుకు వెంకీ అట్లూరి స్పందిస్తూ..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్‌లో చిరుతపులి

‘దీవాన మూవీ కంటెంట్ చాలా బాగుంది. ఇది ప్రేమ సాంగ్ వినగానే ఆకట్టుకుంది. హర్షిత్, స్మేహ బాగా పర్‌ఫార్మ్ చేశారు. హర్షిత్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి’ అని చెప్పిన అనంతరం దీవాన మూమెంట్ గురించి చెబుతూ.. ‘‘గజిని సినిమా నుంచి సూర్యకు పెద్ద అభిమానిని. ఒక మంచి సినిమా ఆయనతో చేద్దామని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీని స్టార్ట్ చేశాం. ఈ మూవీకి సంబంధించి ఊటీలో షూటింగ్ చేస్తున్నాం. ఫెర్న్‌హిల్ ప్యాలెస్‌లో షూటింగ్ జరుగుతుంది. చివరి రెండు రోజుల షూట్‌లో ఉండగా, ముందు రోజు షూటింగ్ చేసి ప్యాకప్ చెప్పి వెళ్లిపోయాం. కరెక్ట్‌గా మేము షూటింగ్ చేసి వెళ్లిపోయిన తర్వాత అరగంటకి ఆ ప్లేస్‌లోకి చిరుతపులి వచ్చింది. అక్కడ ఒక కుక్క ఉంది. ఆ కుక్కని చంపేసి, తీసుకెళ్లిపోయింది. నెక్ట్స్ డే షూటింగ్.. లాస్ట్ డే. అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాం. సూర్య, రవీనా టాండన్ వంటి వారు అప్పటికే నాన్ స్టాప్‌గా 14 గంటలు పని చేసి ఉన్నారు. నైట్ 10.30 అనుకుంటా. చిరుతపులి అయితే అక్కడకు వచ్చింది. కానీ, బయటకు వెళ్లిందో, లేదో మాత్రం ఎవరికీ తెలియదు.

ఫెర్న్‌హిల్ ప్యాలెస్‌లో భయానక అనుభవం

ఫెర్న్‌హిల్ ప్యాలెస్‌ ఎలా ఉంటుందంటే.. ముందంతా ప్యాలెస్ ఉంటుంది.. వెనుక మొత్తం అడివే ఉంటుంది. అక్కడ అన్నీ లైట్స్ పెట్టారు. ఇంకా గంటన్నర చేస్తే షూటింగ్ అయిపోతుంది. అప్పుడే అందరూ పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. చిరుత పులి వచ్చింది అంటూ ఒకటే పరుగులు. చిరుత పులి కాదు ఏం కాదు.. కుక్క అయి ఉంటుంది అనీ, నేను ఇటు తిరగగానే.. నా ముందు నుంచే అది వెళ్లింది. నేను చూసినట్టు ఎవరికీ తెలియదు. నేను ఒకవేళ ఆ విషయం చెబితే షూటింగ్ ఆగిపోతుంది. ఏం లేదు, ఏం లేదు అని ఎవరికీ చెప్పకుండా షూటింగ్ పూర్తి చేశాను. ఇది రీసెంట్‌గా నా లైఫ్‌లో జరిగిన దీవాన మూమెంట్ అని చెప్పుకోవచ్చు’’ అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.

చిరుతపులి ఘటన జరిగినప్పటికీ, సూర్య, రవీనా టాండన్ వంటి నటీనటులు షూటింగ్‌ను పూర్తి చేయడానికి సహకరించారని వెంకీ అట్లూరి తెలిపారు. ఇది నిజంగానే చాలా భయానకమైన అనుభవం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.