|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మన శంకర వరప్రసాద్‌గారు సినిమాపై వెంకీ మామ బిగ్ అప్డేట్‌

Updated: 03-12-2025, 11:54 AM
మన శంకర వరప్రసాద్‌గారు సినిమాపై వెంకీ మామ బిగ్ అప్డేట్‌
  • మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాతో 2026 సంక్రాంతికి రాబోతున్నారు.
  • ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తూ, చిరంజీవితో కలిసి ఓ పాటలో డ్యాన్స్ చేయనున్నారు.
  • వెంకటేష్ తన పాత్ర షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించి, చిరంజీవితో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా ఈ చిత్రం గ్రాండ్‌గా తెరకెక్కుతోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాపై విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో వెంకీ మామ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవితో కలిసి పనిచేసిన అనుభవం, సినిమా విడుదలకు సంబంధించి వెంకటేష్ పంచుకున్న వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి కొత్త సినిమా: ‘మన శంకర వరప్రసాద్‌గారు’

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి, పైకి వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన రీ-ఎంట్రీలో అదరగొడుతున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు వెళ్తున్నారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే వచ్చే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్‌గారు అనే కొత్త సినిమాతో రాబోతున్నారు.

వెంకటేష్ కీలక పాత్ర, డ్యాన్స్ నంబర్

ఈ సినిమాలో చిరంజీవి హీరోగా చేస్తుండగా నయనతార హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే చిరంజీవితో విక్టరీ వెంకటేష్ ఓ పాటలో స్టెప్పులు కూడా వేయనున్నారట. దాదాపు 500 మందితో ఈ పాట ఉంటుందని మొన్నటి నుంచి ప్రచారం జోరు అందుకుంది. అయితే దీనిపై తాజాగా విక్టరీ వెంకటేష్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

వెంకీ మామ అప్డేట్: షూటింగ్ పూర్తి, అనుభవం

ఆ పాట నిజమే అన్నట్లుగా ఓ షాడో ఫోటో కూడా విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అలాగే మన శంకర వరప్రసాద్‌గారు సినిమా షూటింగ్‌లో తన పాత్ర నేటితో ముగిసినట్లు పేర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం చాలా బాగుందని వెల్లడించాడు. అతనితో సినిమా చేయడం సంతోషాన్ని ఇచ్చిందని వివరించాడు. 2026 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ఈ సినిమా హ‌వా చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వెంకటేష్.

వెంకటేష్ ఇచ్చిన ఈ అప్‌డేట్ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. మెగాస్టార్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.