|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దూకుడు సినిమా టైంలో నన్ను డైరెక్టర్ ఆ ఆపరేషన్ చేయించుకోమన్నారు.. వెన్నెల కిషోర్ షాకింగ్ కామెంట్స్

Published: 12-05-2025, 1:01 AM
దూకుడు సినిమా టైంలో నన్ను డైరెక్టర్ ఆ ఆపరేషన్ చేయించుకోమన్నారు.. వెన్నెల కిషోర్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ తాజాగా ‘దూకుడు’ సినిమా షూటింగ్‌లోని ఒక ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల ఆయనకు చేసిన ఒక అనూహ్యమైన సూచన గురించి ఆయన పంచుకున్న విషయాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Key Points

1

దూకుడు సినిమా షూటింగ్ సమయంలో వెన్నెల కిషోర్‌కు డైరెక్టర్ శ్రీను వైట్ల ఆపరేషన్ చేయించుకోమని సూచించారు.

2

మహేష్ బాబుతో సన్నిహితంగా కనిపించడానికి సన్నగా ఉండాలని డైరెక్టర్ కోరారు.

4

ఈ విషయంపై వెన్నెల కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెన్నెల కిషోర్ షాకింగ్ వ్యాఖ్యలు

టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) మనందరికీ సుపరిచితమే. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రలతో, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ సినిమా చూసినా కిశోరే కనిపిస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే తాాజాగా ఆయన నటించిన ‘సింగిల్‌'(Single) చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘దూకుడు సినిమా టైంలో శ్రీను వైట్ల(Sreenu Vaitla) గారు నన్ను లైపో ఆపరేషన్ చేయించుకో నేను మనీ ఇస్తాను అని అన్నారు.

ఎందుకంటే మహేబ్ బాబు(Mahesh Babu) పక్కన ఉండే రూల్‌లో అందరూ సన్నగా కనిపిస్తారు. నువ్వు లావు ఉంటే బాగోదు అని అన్నారు. అప్పుడు నేను తగ్గుతా అని చెప్పాను, కానీ తర్వాత తగ్గలేదు. బట్ సర్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక ఇలానే బాగుంది అన్నారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంత(Samantha) హీరోయిన్‌గా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’(Dukudu) సినిమాలో వెన్నెల కిశోర్ ‘శాస్త్రి’ అనే పాత్రలో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే.

దూకుడు సినిమా షూటింగ్ అనుభవం

శ్రీను వైట్ల సూచన

వెన్నెల కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దూకుడు సినిమా షూటింగ్‌లోని ఈ ఆసక్తికరమైన విషయం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.