|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేవుడిపైనే భారమంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన వేణు స్వామి భార్య.. ఆందోళనలో ఫ్యాన్స్

Published: 13-07-2025, 2:11 AM
దేవుడిపైనే భారమంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసిన వేణు స్వామి భార్య.. ఆందోళనలో ఫ్యాన్స్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వాణిశ్రీ తాజాగా ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. విమాన ప్రయాణంలో ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి ఆమె ఈ వీడియోలో వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

వేణు స్వామి భార్య వాణిశ్రీ విమాన ప్రయాణంలో ఎదుర్కొన్న భయానక అనుభవం.

2

విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

4

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ నెటిజన్లను ఆందోళనలో ముంచెత్తుతోంది.

వాణిశ్రీ విమాన ప్రయాణ అనుభవం

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానంలో ప్రయాణం చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swami) భార్య వాణిశ్రీ ప్రయాణిస్తోన్న విమానంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెతో పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో షేర్ చేశారు. ‘అనుకోకుండా విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే విమానంలోకి ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఎంతో భయంతోనే ఉన్నాను. అసలు సేఫ్‌గా భూమి మీదకు ల్యాండ్ అవుతామా? లేదా? గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయా? అనే భయంతోనే విమాన ప్రయాణం చేశాను.

ఏసీ సమస్యలతో ప్రయాణికుల ఇబ్బందులు

ఈ విమానంలో ప్రయాణిస్తున్నంత సేపు భగవంతుడిపైనే భారం వేశాను. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు ఏసీలు పని చేయలేదు. దీని వల్ల వందలాది మంది ప్రయాణికులు అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. ఇలా ఏసీలు పనిచేయకపోవడంతో విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే సందేహాలు అందరికీ కలిగాయి. ఇదే విషయం గురించి సిబ్బందిని ప్రశ్నించిన సరైన సమాధానం మాత్రం రాలేదు. ఇలా ఏసి పనిచేయకపోవడంతో ఇదేదో చెడుకు సంకేతంగా భావించాం. విమానం దిగే వరకు క్షణక్షణం భయంతోనే గడిపాం.

సోషల్ మీడియాలో వైరల్ వీడియో

వందల మందితో ప్రయాణం చేస్తున్నటువంటి విమానంలో ఇంత పెద్ద సమస్య ఉంటే ఎవరు సమస్యను పట్టించుకోవడం లేదు? ఈ సమస్య గురించి ప్రశ్నిస్తే సిబ్బంది మాత్రం చిన్న సారీ చెబుతున్నారు. సారీ చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ‘ అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది వీణా శ్రీవాణి(Veena Srivani). ఏది ఏమైనా తాము ప్రయాణిస్తోన్న విమానంలో ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చాలా సేఫ్‌గా ల్యాండ్ అయ్యామని వీడియోలో చెప్పుకొచ్చింది వేణు స్వామి భార్య. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు విమాన ప్రయాణం అంటేనే చాలా భయమేస్తుంది అంటూ ఆందోళన చెందుతున్నారు. Link

వేణు స్వామి భార్య వాణిశ్రీ విమాన ప్రయాణ అనుభవం చాలామందిలో భయాన్ని నింపింది. ఈ ఘటన విమాన ప్రయాణాలపై ప్రజలకున్న ఆందోళనను మరింత పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.