|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేణు స్వామి ఫైర్: శివాజీలా మాట్లాడితే అంతే సంగతులు! ఐక్యరాజ్య సమితి ఎంట్రీ ఫిక్స్! 💥

Published: 11-01-2026, 8:30 PM
వేణు స్వామి ఫైర్: శివాజీలా మాట్లాడితే అంతే సంగతులు! ఐక్యరాజ్య సమితి ఎంట్రీ ఫిక్స్! 💥
  • వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు: శివాజీలా మాట్లాడితే ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగేదేమోనన్న భయం!
  • నాగచైతన్య, శోభితల వీడియోపై టార్గెట్ చేసినందుకు వేణు స్వామి ఆవేదన, అసమాన న్యాయంపై అసంతృప్తి వ్యక్తం.
  • అనసూయ ఫోటోపై మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించిందని వేణు స్వామి స్పష్టీకరణ, సంచలన కామెంట్స్.
  • తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్లస్ రెండు ఐదు అవుతుందంటూ వేణు స్వామి స్టైల్లో కౌంటర్, దుమారం రేపేలా వ్యాఖ్యలు.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. శివాజీ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం రండి.

శివాజీ గురించి వేణు స్వామి సంచలన కామెంట్స్!

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) గురించి ప్రత్యేకమైం పరిచయం అవసరం లేదు. ప్రముఖులు, రాజకీయనాయకుల జాతకాలు చెప్తూ, వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా ఈయన తన నోటికి పని చెప్పాడు. మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ రీసెంట్ గా జరిగిన నటుడు శివాజీ ఇష్యూ గురించి ప్రస్తావించాడు.

నాగచైతన్య, శోభితలపై వేణు స్వామి అసహనం!

అవే కామెంట్స్ తను చేసి ఉంటే తనను బ్రతకానిచ్చేవారు కాదు అంటూ చెప్పుకోచ్చాడు. ‘నటుడు శివాజీలా నేను మాట్లాడి ఉంటే నన్ను ఈపాటికి జైల్లో వేసేవారు. మీడియా ఛానల్స్ సైతం నన్ను టార్గెట్ చేసేవి. ఐక్యరాజ్యసమితి కూడా రంగంలోకి దిగేది. అసలు నన్ను బతకనిచ్చేవారు కాదు. నాగచైతన్య- శోభితలపై నేను చేసిన వీడియోకి చాలా టార్గెట్ చేశారు. అందుకే, ఇక్కడ అందరికీ సమానమైన న్యాయం జరగడం లేదు అనిపిస్తుంది.

అనసూయ వివాదంపై వేణు స్వామి స్ట్రాంగ్ కౌంటర్!

ఇక అనసూయ గురించి ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్ లో పెట్టే ఏ ఫోటోపై అయినా మాట్లాడే హక్కు నాకు ఉంది. రాజ్యాంగం మీకు కల్పించిన హక్కులే మాకు కల్పించింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఆలా లేదు. ఇక్కడ రెండు ప్లస్ రెండు ఐదు అవుతుంది” అంటూ తన స్టయిల్లో కౌంటర్ ఇచ్చాడు. మరి వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీస్తాయా అనేది చూడాలి.

వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఆయన కామెంట్స్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.