|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటి ప్రగతికి వేణుస్వామి షాక్: ‘ఆ క్రెడిట్ నాకు వద్దు!’

Published: 29-12-2025, 8:41 AM
నటి ప్రగతికి వేణుస్వామి షాక్: 'ఆ క్రెడిట్ నాకు వద్దు!'
  • వేణుస్వామి సినిమా సెలబ్రిటీలతో పూజలు చేయించి పాపులర్ అయ్యారు.
  • నటి ప్రగతి వేణుస్వామితో పూజలు చేయించుకుని మెడల్ సాధించినట్లు వార్తలు వచ్చాయి.
  • తన పూజల వల్ల ఆమె విజయం సాధించిందని వచ్చే క్రెడిట్ తనకు అవసరం లేదని వేణుస్వామి స్పష్టం చేశారు.
  • ప్రగతి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన వేణుస్వామి, తాను క్రెడిట్ కోసం కాదని తేల్చి చెప్పారు.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల నటి ప్రగతి చేసిన వ్యాఖ్యలపై ఆయన సంచలనంగా స్పందించారు. తన పూజల క్రెడిట్ తనకు అవసరం లేదని, తాను దుర్మార్గుడిని కాదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

వేణుస్వామి పాపులారిటీ, వివాదాలు

Venuswamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఈమధ్య ఈయన పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సినిమా హీరో హీరోయిన్ల తో పూజలు చేయించడంతో ఒక్కసారిగా వేణు స్వామి పాపులర్ స్టార్ అయిపోయాడు. ఈయన చేసే పూజల వల్ల చాలామంది జీవితం మారిందని కొందరు ఆయనను నమ్ముతున్నారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. దాంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.. ఒకవైపు ఆయన పై ట్రోల్స్ ఎదురవుతున్నా కూడా సెలబ్రిటీలు మాత్రం ఆయనతో పూజలు చేస్తున్నారు.. ఇటీవల సినీ నటి ప్రగతి కూడా పూజలు చేయించింది. అనంతరం ఆమె రేజ్లింగ్ లో మెడల్ సాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన నటి ప్రగతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది.

జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మొదటిసారి క్లారిటీ ఇచ్చారు.. ఆయన మాట్లాడుతూ.. నాపై ఎన్నో ట్రోల్స్ వస్తూ ఉంటాయి అలాగని నేను ఏమి బాధపడను.. నాకున్న క్రేజ్ నాకు ఉండనే ఉంటుంది. నా దగ్గరికి ఎంతోమంది పూజలు చేయించుకోవడానికి వస్తారు. అందులో ఎక్కువగా సినిమా వాళ్లు రావడం విశేషం. వేణు స్వామి డబ్బులు తీసుకొని పూజలు చేస్తున్నాడని చాలామంది అనుకుంటారు. నాకు డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకునే వాళ్ళు వేరే ఉన్నారు. నేనెప్పుడూ సెలబ్రిటీలతో పూజలు చేసిన వారి ఫలితం కోసమే ఆశిస్తాను అని ఆయన అంటున్నారు. అలాగే నటి ప్రగతి మెడల్ సాధించిన విషయం గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావన వస్తుంది. దానిపై ఆయన మాట్లాడుతూ నాకు ఆమె క్రెడిట్ ఏమీ అవసరం లేదు. ఆమె సినిమాల పరంగా సక్సెస్ అవ్వడానికి రాలేదు.. నేను స్పోర్ట్స్ పరంగా వెళుతున్నాను గురువుగారు పూజ చేయించండి అని అడిగారు. ఆమెకు ఆ విధంగానే నేను పూజలు చేశాను అని ఆయన అన్నారు.. ఒకరి క్రెడిట్ తీసుకునే అంత దుర్మార్గున్ని కాదు అంటూ వేణు స్వామి సీరియస్ అయ్యారు. అయితే ఇటీవల సినీ నటి ప్రగతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. వేణు స్వామి తో చేసిన పూజల గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వేణు స్వామి కూడా ఆమె అన్న మాటలు పై రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి దీనిపై ప్రగతి రియాక్ట్ అవుతారేమో చూడాలి..

నటి ప్రగతి పూజలు, మెడల్ విజయం

ప్రగతి వ్యాఖ్యలపై వేణుస్వామి సీరియస్ రియాక్షన్

ఒకప్పుడు వేణు స్వామి పేరు పెద్దగా ఎవరికి తెలిసేది కాదు.. ఎప్పుడైతే స్టార్ హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు అప్పటినుంచి ఆయన ప్రముఖ జ్యోతిష్యుడుగా మారాడు. అంతే కాదు సెలబ్రిటీల జ్యోతిష్యుడుగా కూడా పిలుస్తున్నారు..తెలుగు స్టార్ హీరో హీరోయిన్లయినా నాగచైతన్య సమంత విడిపోతారని చెప్పినా మాట నిజమైంది అప్పటినుంచి ఆయనను నమ్మడం మొదలైంది.. ఆ తర్వాత ఆయన ఏం చెబితే అది జరుగుతుందని నమ్ముతున్నారు. హీరోయిన్లతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయన చేత పూజల చేయించుకున్న హీరోయిన్లు, ఇతర సెలబ్రెటీలు టాప్ పొజిషిన్‌కు వెళ్లడంతో వేణుస్వామిపై గురి బాగా కుదిరింది. కొన్ని రోజుల క్రితం నటి ప్రగతి కూడా ఆయనతో పూజలు చేయించుకుంది. ఆ తర్వాతే ఆమె రెజ్లింగ్లో పథకాన్ని సాధించింది. ఇకముందు ఏ హీరోయిన్ వేణు స్వామి తో పూజలు చేయించుకుంటారో అన్నది జనాల్లో ఆసక్తిగా మారింది. మరి నెక్స్ట్ ఏ హీరోయిన్ ఆ లిస్టులోకి చేరుతుందో చూడాలి..

మొత్తానికి నటి ప్రగతి చేసిన వ్యాఖ్యలు, వాటిపై వేణుస్వామి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదంపై నటి ప్రగతి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.