|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రిషపై పార్థీబన్ సంచలన వ్యాఖ్యలు! కౌంటర్ ఇచ్చిన త్రిష.. అసలేం జరిగింది?

Published: 09-03-2026, 10:05 AM
త్రిషపై పార్థీబన్ సంచలన వ్యాఖ్యలు! కౌంటర్ ఇచ్చిన త్రిష.. అసలేం జరిగింది?
  • త్రిష, విజయ్ దళపతి మధ్య సంబంధంపై వస్తున్న వార్తలు, దీనిపై బీజేపీ నేతల కామెంట్స్.
  • దర్శకుడు పార్థీబన్ త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
  • పార్థీబన్ వ్యాఖ్యలకు త్రిష తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
  • త్రిష కౌంటర్ పై పార్థీబన్ తిరిగి స్పందించడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

ప్రముఖ నటి త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో సన్నిహితంగా ఉండడం, దీనిపై వస్తున్న వార్తలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దర్శకుడు పార్థీబన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి త్రిష కౌంటర్ ఇవ్వడంతో మరింత దుమారం రేగింది.

త్రిష, విజయ్ లపై వస్తున్న పుకార్లు

R. Parthiban:ప్రముఖ హీరోయిన్ త్రిష (Trisha ) ఈ మధ్యకాలంలో తన సినిమా కెరియర్ కంటే కూడా వ్యక్తిగత కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy)తో చట్టపట్టలేసుకొని తిరగడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఈమె వల్లే విజయ్ కి ఆయన భార్య సంగీత (Sangeetha ) విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ప్రముఖ బిజెపి లీడర్..” త్రిష ఇంటి నుండి విజయ్ బయటకు రావాలి” అంటూ సంచలన కామెంట్లు చేశారు. దీనిపై స్పందించిన త్రిష టీం ఆయనకు కౌంటర్ ఇవ్వగా.. ఆ బిజెపి లీడర్ దిగివచ్చి త్రిషకి క్షమాపణలు చెప్పారు.

అయితే సమస్య సద్దుమణిగింది అనుకునే లోపే తాజాగా చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు విజయ్ మళ్ళీ త్రిషను తీసుకొని వెళ్లడం సంచలనంగా మారింది. అటు ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని కూడా వీరి రిలేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు ఆర్. పార్థీబన్ కూడా కామెంట్లు చేయడంతో మండిపడ్డ త్రిష తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఇక దీంతో మళ్లీ పార్థీబన్ త్రిష కామెంట్లకు స్పందించారు. ఇక అసలు ఏం జరుగుతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో త్రిష దర్శకుడు పార్థీబన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” కొన్ని రోజులు ఈ కుందవై (పొన్ని సెల్వన్లో త్రిష పోషించిన పాత్ర పేరు ఇది) ఇంట్లోనే ఉంటే మంచిది. బయటకు రావడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా బహిరంగంగా చెప్పలేము కదా .. కొన్ని సందర్భాలలో కవితలను బయటకు చెప్పడం కంటే కూడా మనలో మనమే నిశ్శబ్దంగా ఆస్వాదించడం మంచిది” అంటూ ఆయన తనదైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు . అయితే ఇక్కడ త్రిష పేరు ఆయన డైరెక్ట్ గా స్పందించకపోయినా.. ఆ సినిమాల్లో ఈమె పోషించిన పాత్ర పేరును బయటకు తీస్తూ చేసిన కామెంట్లతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పార్థీబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు

అయితే దీనిపై త్రిష మండిపడింది. “చేతిలో మైక్ ఉందని మాట్లాడే ప్రతి మాట తెలివైనదిగా ఉండదు. దానివల్ల హాస్యం పండదు.. కేవలం మూర్ఖత్వమే అవుతుంది. అవగాహన లేకుండా మాట్లాడే ప్రతి మాట.. అవి ఎవరిని ఉద్దేశించి చెప్పాలన్న దానికంటే మాట్లాడిన వారి గురించి ఎక్కువగా చెబుతాయి” అంటూ పరోక్షంగా పోస్టు పెట్టింది త్రిష..

ఇక దీనిపై స్పందించిన పార్థీబన్ మాట్లాడుతూ..” నేను ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేయలేదు.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో నేను పశ్చాతాపం పడడం తప్ప మరో మార్గం లేదు” అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇక దీంతో ఈ వివాదానికి కాస్త పుల్ స్టాప్ పడినట్లు నెటిజన్స్ కూడా భావిస్తున్నారు.

త్రిష కౌంటర్..పార్టీబన్ రియాక్షన్

எது நடந்ததோ அது தவறாகவே நடந்துள்ளது இதில். வருந்துவதைத் தவிர வேறு வழியில்லை ! https://t.co/pOTDcx1QR8

— Radhakrishnan Parthiban (@rparthiepan) March 8, 2026

https://x.com/rparthiepan/status/2030668336049328463?s=20

మొత్తానికి త్రిష, పార్థీబన్ ల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.