|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vidya Balan: ఆ సీన్‌ కోసం 28 టేకులు.. ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా..

Published: 23-08-2025, 7:42 AM
Vidya Balan: ఆ సీన్‌ కోసం 28 టేకులు.. ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా..

2005లో విడుదలైన ‘పరిణీత’ చిత్రం 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా విద్యాబాలన్ తన అనుభవాలను పంచుకుంటూ, షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను తెలియజేసింది.

Key Points

1

విద్యాబాలన్ 'పరిణీత' చిత్రంలోని ఒక సన్నివేశం కోసం 28 టేకులు వేశారు.

2

షర్మిల ఠాగూర్ సెట్‌కు వచ్చిన సంఘటన గురించి విద్యాబాలన్ తన అనుభవాలను పంచుకున్నారు.

4

'పరిణీత' సినిమా 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది.

‘పరిణీత’ చిత్రం రీరిలీజ్

‘పరిణీత’ చిత్రంతో విద్యాబాలన్‌ ( Vidya Balan ) కెరీర్‌ మొదలైంది. ఈ సినిమా 2005 జూన్‌ 10న విడుదలైంది. శరత్‌ చంద్ర చటోపాధ్యాయ రాసిన పరిణీత (1914) అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సంజయ్‌ దత్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్‌ సర్కార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌ అవుతోంది. ఆగస్టు 29న మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఇంత పరిచయమా? నాకు తెలీదు ఈ సందర్భంగా విద్యాబాలన్‌ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నాకు బాగా గుర్తు.. సైఫ్‌ అలీ ఖాన్‌ తల్లి, బాలీవుడ్‌ స్టార్‌ షర్మిల ఠాగూర్‌ ( Sharmila Tagore ) ఓరోజు సెట్‌కు వచ్చింది. తనను చూసేందుకు నేను చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. ఆవిడంటే నాకెంతో ఇష్టం. మామధ్య ఎంతో అనుబంధం ఉందన్నట్లుగా ఒకరినొకరం పలకరించుకున్నాం. అది చూసిన సైఫ్‌.. ఓహ్‌, మీ ఇద్దరికీ ఇంత పరిచయముందని నాకింతవరకు తెలీదు అని సరదాగా జోక్‌ చేశాడు.

షర్మిల ఠాగూర్ సెట్‌కు వచ్చిన అనుభవం

ఎప్పుడు గుర్తు చేసుకున్నా.. వెంటనే నేను నాకు ఆమె తెలుసు.. కానీ తనకు నేను తెలియదని బదులిచ్చాను. సైఫ్‌ సరదాగా ఉంటూ ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంటుంది. దాదా(ప్రదీప్‌ సర్కార్‌) వల్లే నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ప్రతి చిన్నవిషయాన్ని కూడా గుర్తించి సీన్‌ మళ్లీ చేయిస్తాడు. అవసరమైతే వంద టేకులైనా తీసుకుంటాడు.

ప్రదీప్ సర్కార్ దర్శకత్వం

కన్నీటి చుక్క సరిగ్గా రావాలని.. కేవలం మా పర్ఫామెన్స్‌ కోసమే కాదు, వెనకాల పావురాలు ఎగిరే క్షణాలు కూడా సరిగ్గా రావాలనుకుంటాడు. అన్నీ సరిగ్గా కుదరాలని భావిస్తాడు. ఒక పాటలో నేను ఏడవాల్సి ఉంటుంది. ఆ పాటలోని ఓ లైన్‌ దగ్గర నా కన్నీటిచుక్క కిందపడాలి. దీని కోసం 28 టేకులు తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రదీప్‌ సర్కార్‌.. అనారోగ్యంతో 2023లో కన్నుమూశారు.

విద్యాబాలన్ ‘పరిణీత’ చిత్రం తన కెరీర్‌కు మంచి నాంది అని, దర్శకుడు ప్రదీప్ సర్కార్ తనకు నటనలో మెళకువలు నేర్పించారని గుర్తుచేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ అవ్వడం సంతోషంగా ఉందని తెలిపింది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.