
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్, తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపారు. ‘చక్రం’ సినిమాతో సంబంధించిన వివాదం వల్ల తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Key Points
విద్యా బాలన్ పై ఐరన్ లెగ్ ముద్ర వేశారని ఆరోపణలు.
మోహన్ లాల్ తో నటించాల్సిన చక్రం సినిమా ఆగిపోవడం.
సినిమా ఆగిపోవడం వల్ల ఎనిమిది నుంచి తొమ్మిది సినిమాలు కోల్పోయినట్లు విద్యా బాలన్ వెల్లడి.
కొన్ని సినిమాలలో షూట్ పూర్తయ్యాక కూడా తొలగించబడినట్లు తెలిపారు.
విద్యా బాలన్ కెరీర్ లోని ఒడిదుడుకులు
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… కొంతమంది మాత్రమే స్టార్ డం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ విద్యా బాలన్ (Vidya Balan ) ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ భామ…. తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గర అయింది. ముఖ్యంగా ఆమె కెరియర్ లో వచ్చిన డర్టీ పిక్చర్.. సినిమాతో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసింది.
‘చక్రం’ సినిమా వివాదం
అయితే అలాంటి హాట్ బ్యూటీ విద్యాబాలన్ కు ఇండస్ట్రీలో కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయట. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ విద్యాబాలన్ పేర్కొన్నారు. ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర కూడా వేశారట. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో నటించాల్సిన చక్రం సినిమా ఆగిపోవడంతో.. ఈ ముద్ర వేశారట కొంతమంది సినీ ప్రముఖులు.
ఐరన్ లెగ్ ముద్ర వేయడం వల్ల ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు
కానీ హీరో అలాగే దర్శకుడికి మధ్య జరిగిన భేదాభిప్రాయాల కారణంగా చక్రం సినిమా ఆగిపోయిందని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం తెలియకుండా చాలా మంది తనను ఐరన్ లెగ్ అని కూడా అన్నారని ఫైర్ అయింది. ఆ ఒక్క సినిమా ఆగిపోవడంతో నేను ఎనిమిది నుంచి తొమ్మిది సినిమాలు పోగొట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ సినిమాలన్నీ రాత్రికి రాత్రి కోల్పోయానని ఎమోషనల్.. అయ్యారు విద్యాబాలన్. కొన్ని సినిమాలలో షూట్ కంప్లీట్ అయ్యాక కూడా తనను తొలగించినట్లు వెల్లడించారు.
విద్యా బాలన్ తన అనుభవాలను పంచుకోవడం ద్వారా సినీ పరిశ్రమలోని కష్టాలను వెల్లడించారు. ఐరన్ లెగ్ ముద్ర వంటి అపవాదుల వల్ల నటీమణులు ఎదుర్కొనే సమస్యలను ఈ ఘటన హైలైట్ చేసింది.


