|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘LIC’ సీక్వెల్ ప్లాన్స్ రివీల్ చేసిన విఘ్నేష్ శివన్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 15-04-2026, 2:05 AM
షాకింగ్: 'LIC' సీక్వెల్ ప్లాన్స్ రివీల్ చేసిన విఘ్నేష్ శివన్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • విఘ్నేష్ శివన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సీక్వెల్ ప్లాన్స్!
  • టైటిల్ వివాదం: LIC నుండి రూ. 112 కోట్ల డిమాండ్!
  • ప్రదీప్, కృతి శెట్టి జంటగా నటించిన మూవీకి సీక్వెల్?
  • ఎస్జే సూర్య, ప్రదీప్ పాత్రలతో సరికొత్త కథలు!

టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సీక్వెల్ గురించి ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టకపోయినా, సీక్వెల్ తీయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టైటిల్ వెనుక అసలు కథ తెలుసా?

కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. దర్శకుడు విఘ్నేష్ శివన్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ వివాదం, సీక్వెల్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నారు. మొదట ఈ సినిమాకు ‘LIC’ అని పేరు పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు, ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ LIC నుంచి వీరికి నోటీసులు వచ్చాయి. ఏడు రోజుల్లోగా పేరు మార్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఒకవేళ అదే పేరును వాడుకోవాలంటే ఏకంగా రూ. 112 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు సంస్థ డిమాండ్ చేసిందట. అంత భారీ మొత్తం ఇవ్వడం ఇష్టం లేక, విఘ్నేష్ శివన్ తెలివిగా ‘C’ బదులు ‘K’ అక్షరాన్ని చేర్చి టైటిల్‌ను ‘LIK’ గా మార్చారట.

సీక్వెల్ తీసే ఆలోచనలో విఘ్నేష్!

ఈ క్రమంలో ఆయన LIP, LIT, LIF వంటి రకరకాల పేర్లను కూడా ఆలోచించినట్లు సరదాగా చెప్పుకొచ్చారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ, విఘ్నేష్ శివన్ ఈ కథపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీకి సీక్వెల్స్ తీసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎస్‌జే సూర్య, ప్రదీప్ రంగనాథన్ పాత్రలతో కథను రకరకాల కోణాల్లో అన్వేషించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. “నాకు ఆనాకు ఆర్థిక స్తోమత ఉంటే ఖచ్చితంగా సీక్వెల్ రాస్తాను, ఆ పని తప్పకుండా చేస్తాను” అని విఘ్నేష్ తన మనసులోని మాటను బయటపెట్టారుర్థిక స్తోమత ఉంటే ఖచ్చితంగా సీక్వెల్ రాస్తాను, ఆ పని తప్పకుండా చేస్తాను” అని విఘ్నేష్ తన మనసులోని మాటను బయటపెట్టారు. స్టార్ హీరోయిన్ నయనతార భర్తగా, టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు ఉన్న విఘ్నేష్ శివన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైటిల్ కోసం 112 కోట్లు అడగడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రదీప్, సూర్య పాత్రలతో కథ?

నేను ధనుష్ అలాంటి ఒప్పందం కుదుర్చుకున్నాం.. కారా డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

విఘ్నేష్ శివన్ సీక్వెల్ గురించి చేసిన ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.