
📌 Key Points
- విజయ్ ఆంటోనీ సంచలన ప్రకటన, సినిమాలకు గుడ్‌బై చెప్పి రైతుగా మారే ఆలోచన.
- ‘నూరుసామి’ ప్రమోషన్స్‌లో బయటపడిన ఈ వార్తతో ఫ్యాన్స్ షాక్.
- పొల్లాచి వంటి పల్లెటూరిలో స్థిరపడి ప్రశాంత జీవితం కోరుకుంటున్న విజయ్.
- రెండేళ్లలో పొలం కొని వ్యవసాయం చేయాలనుకుంటున్న హీరో, వైరల్ అవుతున్న వార్త.
కోలీవుడ్ సంచలనం విజయ్ ఆంటోనీ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది! ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిగా వేరే జీవితాన్ని గడపాలని చూస్తున్నారట. ఈ వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి!
అసలు విజయ్ ఆంటోనీ ఏమన్నాడు?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ త్వరలో ‘నూరుసామి’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘బిచ్చగాడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శశి దర్శకత్వంలో రాబోతోంది. హిట్ కాంబో రిపీట్ కాబోతుండటంతో ప్రేక్షకుల్లో ‘నూరుసామి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో విజయ్ సరసన స్వాసిక హీరోయిన్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, విజయ్ ప్రమోషన్స్‌లో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను త్వరలోనే సినిమాలకు దూరం కాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘నూరుసామి’ చిత్రంలో మీరు ఒక రైతుగా నటించిన అనుభవం ఎలా ఉంది? అలాగే జీవన శైలి ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘‘నాకు నిజంగా ఇష్టమైనది సరళమైన జీవనశైలి. నా పని చెన్నైలో ఉండటం వల్ల నేను ఇక్కడే ఉంటున్నాను. దానితో పాటు, సంగీతం ,నటన కూడా నా జీవితంలో భాగమే. సాధారణమైన, ప్రశాంతమైన జీవనశైలిని నేను నిజంగా ఆస్వాదిస్తాను. పల్లెటూరిలో జీవించడం, సాయంత్రం 6 లేదా 7 గంటలకే నిద్రపోవడం, పక్షుల కిలకిలారావాలు, కోడిపుంజుల కూతలు వినడం ఇవే నాకు సంతోషాన్నిస్తాయి. నిజం చెప్పాలంటే, రాబోయే రెండు, మూడేళ్లలో నేను పొల్లాచి వంటి ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఉంది. పల్లెటూరి జీవనశైలికి దగ్గరగా వెళ్లాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. అందుకే దానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నాను. పొలం కొన్న తర్వాత అక్కడే సెటిల్ అవుతాను’’ అని అన్నారు. దీంతో విజయ్ ఆంటోనీ సినిమాలకు గుడ్ బై చెప్పి పల్లెటూరిలో పొలం పనులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘నూరుసామి’ ప్రమోషన్స్‌లో సంచలనం!
ఫ్యాన్స్‌కు షాక్.. భవిష్యత్తు ప్రణాళికలు!
విజయ్ ఆంటోనీ ఈ నిర్ణయం వెనుక పూర్తి కారణాలు, ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి. ఆయన కెరీర్‌పై ఈ వార్త ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


