
📌 Key Points
- విజయ్ ఆంటోని, శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం సంచలనం సృష్టించింది.
- ‘బిచ్చగాడు’ సినిమాలోని పాట స్ఫూర్తితో ‘వంద దేవుళ్లు’ టైటిల్ ఖరారు చేశారు.
- విష్ణు మంచు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
- ఈ చిత్రంలో విజయ్ ఆంటోని రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు.
విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘వంద దేవుళ్లు’ అనే సినిమాతో వస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విష్ణు మంచు విడుదల చేశారు.
విజయ్ ఆంటోని, శశి కాంబినేషన్ రిపీట్
Vanda Devullu: మల్టీ టాలెంటెడ్ పర్సన్ విజయ్ ఆంటోని (Vijay Antony), దర్శకుడు శశి (Sasi Director) కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ (Bichagadu) చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆ సినిమా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక అందులోని సాంగ్ నిత్యం ఏదో చోట వినబడుతూనే ఉంటుంది. ‘బిచ్చగాడు’ అనంతరం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రాన్ని ఆసక్తికర టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘బిచ్చగాడు’ సినిమాలోని ‘వంద దేవుళ్లే’ అనే పాట స్ఫూర్తితో ఈ సినిమాకు ‘వంద దేవుళ్లు’ (Vanda Devullu) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా ‘మా’ అధ్యక్షుడు, హీరో విష్ణు మంచు (Vishnu Manchu) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ‘బిచ్చగాడు’ మాదిరిగానే ఏదో ట్విస్ట్ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది. పోస్టర్ మాత్రం ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. చెరుకు తోటలో విజయ్ ఆంటోనీ కత్తి పట్టుకున్న తీరు, వెనకాలే స్వాసిక మాసీ లుక్‌లో కనిపించిన తీరు చూస్తుంటే.. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడటం ఖాయమని చెప్పొచ్చు.
‘వంద దేవుళ్లు’గా వస్తున్న బిచ్చగాడు కాంబో
విజయ్ ఆంటోని ఇందులో రా అండ్ రస్టిక్ పాత్రని పోషిస్తున్నట్టుగా ఈ పోస్టర్ తెలియజేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ చిత్రయూనిట్‌కు విష్ణు మంచు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ మూవీకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా టీమ్ వెల్లడించింది. అలాగే పోస్టర్ వదిలిన మంచు విష్ణు టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.
A journey of real emotions and family. This is the life they lived.
Happy to unveil the first look of #VandaDevullu . Looks very intense yet heart touching ❤️. My best wishes to @vijayantony garu, Director #Sasi garu, #Swasika garu and the entire team!
ఫస్ట్ లుక్ విడుదల చేసిన విష్ణు మంచు
A #FamilyBiopic … pic.twitter.com/5Z5pXFOBTh
— Vishnu Manchu (@iVishnuManchu) March 20, 2026
మొత్తానికి ‘వంద దేవుళ్లు’ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. విజయ్ ఆంటోని మరోసారి తన నటనతో మెప్పిస్తాడో లేదో చూడాలి.


