
📌 Key Points
- ‘దురంధర్ 2’ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ UA 16+ సర్టిఫికెట్ ఇచ్చింది.
- ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు.
- రెహ్మాన్ డకాయిట్ మరణం తర్వాత హమ్జా అలీ మజారి ‘షేర్-ఏ-బలోచ్’గా ఎలా ఎదిగాడనేది కథాంశం.
- యామి గౌతమ్ గూఢచారి పాత్రలో, మాధవన్, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
బాలీవుడ్‌లో ఎదురుచూస్తున్న ‘దురంధర్ 2’ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి UA 16+ సర్టిఫికెట్ వచ్చింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.
దురంధర్ 2కి UA 16+ సర్టిఫికెట్
Dhurandhar 2: బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ధురంధర్ 2. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తిచేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు UA 16+ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీంతో సినిమా థియేటర్లలో విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మేకర్స్ అధికారికంగా మార్చి 19న ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు. ఈ సినిమా మొదటి భాగానికి ఏ సర్టిఫికెట్ రాగా.. ఇప్పుడు రెండో భాగానికి యూఏ వచ్చేటట్టు టీం ప్లాన్ చేసుకోవడం వల్ల.. ఇది ఈ చిత్రానికి ప్లస్ అవ్వచ్చని అందరూ భావిస్తున్నాడు
ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా రణవీర్ సింగ్ నటించారు. మొదటి భాగమైన ధురంధర్ మంచి విజయం సాధించడంతో, రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం, ధురంధర్ 2 రన్‌టైమ్ 208 నిమిషాలుగా ఉండబోతోంది. అంటే దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు సినిమా సాగనుంది. ఇది మొదటి భాగంతో పోలిస్తే కొద్దిగా తక్కువ సమయం ఉండొచ్చని తెలుస్తోంది.
కథ విషయానికి వస్తే.. మేకర్స్ ఇంకా పూర్తి వివరాలను బయటపెట్టలేదు. అయితే అధికార పోరాటం, ప్రతీకారం, విశ్వాసం వంటి అంశాలు కథలో ప్రధానంగా ఉంటాయని సమాచారం. రెహ్మాన్ డకాయిట్ మరణం తర్వాత హమ్జా అలీ మజారి ఎలా ఎదిగి “షేర్-ఏ-బలోచ్”గా మారాడు అనే కోణంలో కథ సాగుతుందని టాక్.
హమ్జా అలీ మజారిగా రణవీర్ సింగ్
ఈ సినిమాలో యామి గౌతమ్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఓ రహస్య గూఢచారి పాత్రలో నటిస్తుందని సమాచారం. అలాగే ఆర్. మాధవన్, సారా అర్జున్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథకు మరింత బలాన్ని ఇస్తాయని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సినిమా షూటింగ్ సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. నిర్మాత సంస్థపై బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిషేధిత పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో జరిమానా విధించినట్లు సమాచారం. అయినప్పటికీ, ఈ వివాదాలు సినిమాపై ఉన్న క్రేజ్‌ను మాత్రం తగ్గించలేకపోయాయి.
కీలక పాత్రల్లో యామి గౌతమ్, మాధవన్
భారీ తారాగణం, పొడవైన రన్‌టైమ్, యాక్షన్‌తో నిండిన కథతో ధురంధర్ 2 ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సినిమాల్లో ఒకటిగా నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దురంధర్ 2 చిత్రం భారీ తారాగణంతో, ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిత్రం విజయం సాధిస్తుందో లేదో చూడాలి.


