|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay Devarakonda: మొన్న ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ

Published: 05-08-2025, 9:50 PM
Vijay Devarakonda: మొన్న ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నటుడు ప్రకాశ్ రాజ్ తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరగనుంది.

Key Points

ఈడీ విచారణకు విజయ్ హాజరు

బెట్టింగ్ యాప్ కేసులో.. నేడు (ఆగస్టు 06) ఈడీ విచారణ జరగనుంది. నటుడు విజయ్ దేవరకొండ అధికారుల ముందు హాజరు కానున్నాడు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌ని ఈడీ అధికారులు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈయన.. మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పాడు. మరి ఈ రోజు విజయ్ దేవరకొండ ఏం చెబుతాడో చూడాలి?

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై దర్యాప్తు

విజయ్ దేవరకొండతో పాటు ‘బాహుబలి’ నటుడు రానా.. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఇవాళ విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో విచారణ జరపనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్స్ గురించి ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్స్, ఎందుకు ప్రమోషన్ చెయ్యాల్సి వచ్చింది? అలానే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

మనీ లాండరింగ్ ఆరోపణలు

విజయ్ దేవరకొండ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుగుతోంది. విచారణ ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.