|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ పెళ్లి మామూలుగా లేదుగా! స్వ‌గ్రామంలో ర‌చ్చ ర‌చ్చ చేసిన రౌడీ హీరో!

Published: 02-03-2026, 6:05 AM
విజయ్ దేవరకొండ పెళ్లి మామూలుగా లేదుగా! స్వ‌గ్రామంలో ర‌చ్చ ర‌చ్చ చేసిన రౌడీ హీరో!
  • విజయ్ దేవరకొండ, రష్మిక‌ల పెళ్లి.. స్వ‌గ్రామంలో గ్రాండ్ రిసెప్ష‌న్!
  • తెలంగాణ సాంప్ర‌దాయ రీతిలో నూత‌న వ‌ధూవ‌రుల‌కు ఘ‌న స్వాగ‌తం పలికిన గ్రామ‌స్తులు!
  • ఫామ్ హౌస్‌లో స‌త్యనారాయ‌ణ స్వామి వ్ర‌తం.. దేవుడి ద‌ర్శ‌నం చేసుకున్న జంట!
  • ఈ నెల 4న హైద‌రాబాద్‌లో భారీ రిసెప్ష‌న్.. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల హాజ‌రు!

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న స్వ‌గ్రామంలో పెళ్లి సంద‌డితో అద‌ర‌గొట్టారు. ర‌ష్మిక‌తో క‌లిసి ఊరందరికీ విందు ఏర్పాటు చేయ‌డంతో గ్రామంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

విజయ్, రష్మిక‌ల పెళ్లి వేడుక‌లు!

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. రష్మిక(Rashmika Mandanna)తో పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామం నాగర్ క‌ర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటకు సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఊరందరికీ దావత్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఫామ్ హౌస్‌లో నూత‌నంగా నిర్మించిన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి, స‌త్యనారాయ‌ణ స్వామి వ్రతం నిర్వ‌హించారు. ఆపై అక్కడికి వ‌చ్చిన వారికి విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు గ్రామ‌స్తులు నూత‌న వ‌ధూవ‌రుల‌కు తెలంగాణ సాంప్ర‌దాయ ప‌ద్దతుల్లో డ‌ప్పు, వాయిద్యాల‌తో ఘన స్వాగ‌తం పలికారు. పెద్ద‌లు నూత‌న జంట‌కు దిష్టి తీసి, ఇంట్లోకి తీసుకెళ్లారు. సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న కూడా తన మూలాలను మర్చిపోకుండా విజయ్ సొంత గ్రామానికి రావడంపై గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ్, రష్మికతో కలిసి ఫామ్ హౌస్‌లో ఫొటోలు దిగారు. ఇక ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖ రాజకీయ నాయకులు, బిగ్ సినీ స్టార్స్ రాబోతున్నారు. వీడియో

స్వ‌గ్రామంలో గ్రాండ్ రిసెప్ష‌న్ చేసిన దేవ‌ర‌కొండ ఫ్యామిలీ!

వైర‌ల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు!

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వేడుక‌లు అంగ‌రంగ వైభవంగా జ‌రిగాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రిసెప్ష‌న్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.