|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ పెళ్లిపై బిగ్ ట్విస్ట్! సీఎం రేవంత్ రెడ్డితో సీక్రెట్ భేటీ! పెళ్లి ఎప్పుడో తెలుసా?

Published: 14-02-2026, 11:35 PM
విజయ్ దేవరకొండ పెళ్లిపై బిగ్ ట్విస్ట్! సీఎం రేవంత్ రెడ్డితో సీక్రెట్ భేటీ! పెళ్లి ఎప్పుడో తెలుసా?
  • విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి ముహూర్తం ఫిక్స్! ఫిబ్రవరి 26న ఉదయపూర్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్!
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ! వైరల్ అవుతున్న ఫోటోలు.
  • గతేడాది ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా జరిగిందట! పెళ్లి వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
  • కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే ఒక్కటి కానున్నారు! అభిమానుల్లో ఆనందం.

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అయింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

సీఎం రేవంత్ రెడ్డితో విజయ్ దేవరకొండ భేటీ వెనుక అసలు కారణం ఇదేనా?

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, విజయ్ సీఎంని కలవడానికి గల ఆయన పెళ్లి అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గతేడాదే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక పెళ్లి? ఉదయపూర్ లో గ్రాండ్ వెడ్డింగ్!

కానీ, ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. కానీ, వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈనెల 26న వీరి పెళ్లి ఉదయపూర్ లో జరుగనుంది అని సమాచారం. దానికి సంబందించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలయ్యాయట. ఈనేపథ్యంలోనే తన పెళ్లికిక్ ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ కలిసినట్టుగా తెలుస్తోంది. అలాగే తన జీవితంలో జరుగనున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని సీఎం ని కోరాడట విజయ్ దేవరకొండ.

గతేడాదే ఎంగేజ్మెంట్.. సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట!

దానికి సీఎం కూడా చాలా పాజిటీవ్ రియాక్ట్ అయ్యారట. ఆలాగే, కాబోయే జంటకు ముందుగానే తన శుభాకాంక్షలు తెలిపారట సీఎం రేవంత్. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్తూ త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి బంధంలో ఒకటి కాబోతున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.