
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులకు తుమ్మన్‌పేటలో గ్రామస్తుల ఘనస్వాగతం
- దంపతులచే తులసిమాతకు ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతం
- వేడుకకు హాజరైన అభిమానులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు
- మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం స్వగ్రామానికి చేరుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేటలో గ్రామస్తులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తుమ్మన్‌పేటలో విజయ్ దేవరకొండ దంపతుల సందడి
ఇటీవలే వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ దంపతులు వారి స్వగ్రామం చేరుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లాలోని బలమూరు మండలం తుమ్మన్‌పేటలో సందడి నెలకొంది. నూతన దంపతులకు గ్రామస్థులు… ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య వారి నివాసానికి తీసుకెళ్లారు.
ఇవాళ ఉదయం 11:15 గంటలకు నూతన దంపతులు విజయ్ దేవరకొండ- రష్మిక వేదమంత్రాలతో డప్పు వాయిద్యాల మధ్య తులసిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సత్యనారాయణస్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త దంపతులను చూసేందుకు గ్రామస్థులతో పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. అభిమానులు, గ్రామస్థుల రాకతో విజయ్ దేవరకొండ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతం, ప్రత్యేక పూజలు
అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రతలు చేపట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా జనాలను నియంత్రిస్తున్నారు.ఆంక్షలు విధించగా… పాసులు అనుమతి ఉన్న వారికి మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీ సైన్యం వత్రం జరిగే మండపంలోకి అనుమతి ఇస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను అచ్చంపేట డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. వ్రతం పూర్తి అయిన తర్వాత… 2 వేల మంది వరకు భోజనాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
వీరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు మార్చి 4న సాయంత్రం సిటీలోని తాజ్ హోటల్లో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ ను ‘ఇన్వైట్ ఓన్లీ’ కార్యక్రమంగా నిర్వహించనున్నారు.
హైదరాబాద్ రిసెప్షన్‌కు రాజకీయ ప్రముఖుల హాజరు
వెడ్డింగ్ రిసెప్షన్ జరిగే హోటల్ బయట కూడా గుమిగూడొద్దని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించొద్దని అభిమానులను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కోరారు. కేవలం ఆహ్వానం ఉన్నవాళ్లే లోపలికి రావాలని క్లారిటీగా చెప్పేశారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలిన ప్రధానమంత్రి మోదీని విజయ్, రష్మిక వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మికల స్వగ్రామ పర్యటన విజయవంతంగా జరిగింది. వారి రిసెప్షన్ వేడుకలో ఎలాంటి రాజకీయ ప్రముఖులు పాల్గొంటారో వేచి చూడాలి.


