
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థంపై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఆయన చేతికి కనిపించిన రింగ్ నిశ్చితార్థం వార్తలకు మరింత బలం చేకూర్చింది. చెప్పకనే విజయ్ తన శుభవార్తను తెలియజేశాడని నెటిజన్లు భావిస్తున్నారు.
Key Points
విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం రహస్యంగా జరిగిందనే వార్తలు.
ఇరువురి నుంచి నిశ్చితార్థంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించింది.
నెటిజన్లు ఆ రింగ్‌ను చూసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రష్మికతో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్: నిజమేనా?
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది బందుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే, ఈ ఎంగేజ్ మెంట్ గురించి అటు విజయ్ నుంచి కానీ.. ఇటు రష్మిక నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని, ఈ వార్తలను ఎవరు ఖండించలేదు కూడా. దీంతో, వీరి(Vijay Devarakonda) ఎంగేజ్ మెంట్ జరగడం నిజమేనని తెలిసిపోయింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంటకు పెళ్లి చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారట కుటుంబసభ్యులు.
రింగ్‌తో తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విజయ్
Pawan Kalyan: 30 నిమిషాలు నాన్ స్టాప్ కన్నడ స్పీచ్.. కన్నడిగుల మనసు గెలిచిన పవన్.. మరి ఇకనైనా..
చెప్పకనే శుభవార్తను చెప్పేశాడా?: నెటిజన్ల కామెంట్స్
అయితే, ఎంగేజ్మెంట్ వార్తల నేపధ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఆదివారం (అక్టోబర్ 5) పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నాడు. విజయ్ తోపాటు కుటుంభ సభ్యులు కూడా దర్శించుకున్నారు. ఆ సమయంలోనే విజయ్ చేతికి ఒక రింగ్ కనిపించింది. దాంతో ఆ రింగ్ ఖచ్చితంగా ఎంగేజ్ మెంట్ రింగ్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ కూడా చెప్పకనే ఆ శుభవార్తను అందరికీ తెలిసేలా చేశాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆలాగే, ఆ ఫోటోను లైక్ చేస్తూ కొత్త జంటకు విశేష్ చెప్తున్నారు.
నిశ్చితార్థంపై అధికారిక ప్రకటన రానప్పటికీ, విజయ్ దేవరకొండ చేతికి ఉన్న రింగ్ ఈ వార్తలను నిజమని నమ్మేలా చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నారు. ఇది నిజంగా శుభవార్తేనా అని అందరూ ఎదురుచూస్తున్నారు.


