|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ఘాటు కిస్.. కింగ్డమ్ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వచ్చేస్తోంది.. డేట్ ఇదే

Published: 30-04-2025, 9:18 AM
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ఘాటు కిస్.. కింగ్డమ్ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వచ్చేస్తోంది.. డేట్ ఇదే

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘హృదయం లోపల’ మే 2న విడుదల అవుతోంది. భాగ్యశ్రీతో కలిసి విజయ్ చేసిన ఘాటు ముద్దు సీన్ ప్రోమోలో చూడొచ్చు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Key Points

1

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ నటించిన 'కింగ్‌డమ్' సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్!

2

మే 2న 'హృదయం లోపల' పాట విడుదల!

4

మే 30న 'కింగ్‌డమ్' సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

కింగ్డమ్ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల

విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ కింగ్డమ్ (Kingdom). గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చిన టీజర్ వీడియో ఎంతగానో ఆకట్టుకోగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వస్తోంది.

కింగ్డమ్ మూవీ నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్ హృదయం లోపల. ఈ సాంగ్ శుక్రవారం (మే 2) రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

“నమ్మకద్రోహం నీడల్లో, ఓ బంధం నటిస్తుండగా.. ఉద్రిక్తమైన ఆకర్షణ ఉంది. కింగ్డమ్ ప్రపంచం నుంచి అనిరుధ్ సాంగ్.. మళ్లీ మళ్లీ మీరు వినాలనుకునే పాటగా ఇది మిగిలిపోతుంది.. హృదయం లోపల” అనే క్యాప్షన్ తో విజయ్ ఈ విషయాన్ని చెప్పాడు.

హృదయం లోపల పాట ప్రోమో

ఈ సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశాడు. ఇది విజయ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఓ ఘాటు ముద్దు సీన్ తో మొదలవుతుంది. ఓ బీచ్ లో కూర్చొని వీళ్లు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పాటను అనిరుధ్ కంపోజ్ చేశాడు. మే 30న కింగ్డమ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

కింగ్డమ్ మూవీ టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ ను కూడా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, అనిరుధ్ రవిచందర్ బీజీఎం, విజయ్ యాక్షన్ ఈ టీజర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది.

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ ఘాటు కిస్

“అలసట లేని ఈ భీకర యుద్ధం.. అలలుగా పారే ఏరుల రక్తం.. వలసపోయినా అలసిపోయినా.. ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్రలు.. మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరి కోసం.. ఇంత బీభత్సం ఎవరి కోసం.. అసలీ వినాశనం ఎవరి కోసం.. రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం.. కాలచక్రాన్ని బద్ధలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం..” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి.

విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో జెర్సీ, మ్యాజిక్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన గౌతమ్.. ఈసారి పూర్తి భిన్నంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ కింగ్‌డమ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

మొత్తానికి, ‘కింగ్‌డమ్’ సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘హృదయం లోపల’ పాట విడుదలతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుందని అనిపిస్తోంది. మే 30 వరకు ఆసక్తిగా ఎదురుచూద్దాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.