|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

13 ఏళ్ల క్రితం పొద్దున లేచి ఆ వెబ్‌సైట్ చూసేవాడిని.. హీరో విజయ్ దేవరకొండ కామెంట్స్

Published: 30-06-2025, 1:23 AM
13 ఏళ్ల క్రితం పొద్దున లేచి ఆ వెబ్‌సైట్ చూసేవాడిని.. హీరో విజయ్ దేవరకొండ కామెంట్స్

దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన ప్రారంభ కెరీర్‌లో idlebrain.com వెబ్‌సైట్ ఎంతగా ఉపయోగపడిందో వివరించాడు. ఈ వెబ్‌సైట్ ద్వారా అతనికి లభించిన అవకాశాల గురించి కూడా చెప్పాడు.

Key Points

1

విజయ్ దేవరకొండ 13 ఏళ్ల క్రితం idlebrain.com వెబ్‌సైట్ చూసేవాడు.

2

శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా కాస్టింగ్ కోసం అప్లై చేశాడు.

4

విజయ్ దేవరకొండ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్‌ను అభినందించాడు.

విజయ్ దేవరకొండ యొక్క idlebrain.com అనుభవం

కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలోచనే ఈ దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ని లాంచ్ చేస్తున్నాం’ అన్నారు నిర్మాత దిల్ రాజు.

ఇటీవల దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరై దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్‌ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. 13 ఏళ్ల క్రితం పొద్దున లేచిన వెంటనే ఐడియల్ బ్రెయిన్ డాట్ కామ్ (idlebrain.com) అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూసేవాడిని. ఎక్కడైనా కాస్టింగ్ కాల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకునే వాడిని. ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదు” అని అన్నాడు.

దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ లాంచ్

“శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కాస్టింగ్ కాల్ అందులో చూడడం నాకు ఇంకా గుర్తుంది. దానికి అప్లై చేశాను. దాదాపు 6 నెలలు టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ కూడా ఒక తృప్తిని ఇచ్చేది. ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆపర్చునిటీ ఉందనే ఆనందం ఉండేది. 16 వేల అప్లికేషన్స్ ఆ సినిమాకి వచ్చాయి. 11 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను కూడా ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద రోల్‌ని ప్లే చేసింది” అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

“ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. దిల్ రాజు డ్రీమ్స్‌ని దిల్ రాజు గారికి ఎందుకు లాంచ్ చేయాలని అనిపించిందో నాకు తెలియదు కానీ ఇది లక్షలాది మందికి ఒక హోప్‌ని ఇచ్చింది. ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్” అని విజయ్ దేవరకొండ చెప్పాడు.

కొత్త ప్రతిభలకు అవకాశాలు

“ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్‌సైట్ లాంచ్ చేయడానికి న్యాయం జరిగినట్టే. దిల్ రాజు గారు 14 మంది డైరెక్టర్స్‌ని లాంచ్ చేశారు. ఈ వేదిక ద్వారా నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్‌ని లాంచ్ చేయబోతున్నారు” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.

“ఐదేళ్ల తర్వాత మీలో కూడా ఎవరో ఒకరు ఇలా స్టేజ్ మీద నిలబడి దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా తమ డ్రీమ్‌ని నెరవేర్చుకున్నామని చెప్తే చాలా ఆనంద పడతాను. ఇంత అద్భుతమైన ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసిన దిల్ రాజు గారికి అభినందనలు. అందరికీ థాంక్యు” అని విజయ్ దేవరకొండ తన స్పీచ్ ముగించాడు.

దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్, కొత్త ప్రతిభలకు వేదికగా నిలుస్తుందని విజయ్ దేవరకొండ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అనేక మంది తమ కలలను నెరవేర్చుకుంటారని ఆయన నమ్ముతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.