
‘కింగ్డమ్’ చిత్రం విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సినిమా విజయం, యూఎస్ ప్రేక్షకులతో తన అనుభవాలు పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాత్రను కూడా ప్రస్తావించారు.
Key Points
కింగ్డమ్ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది.
యూఎస్ ప్రీమియర్ల నుంచి సానుకూల ప్రతిస్పందనలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ గురువారం విడుదలపై మొదట భయపడ్డారని వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కింగ్డమ్ సినిమా విజయోత్సవం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్డమ్’ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్ , భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు.
భారీ అంచనాల నడుమ జూలై 31 విడుదలైన ‘ కింగ్డమ్ ’ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కింగ్డమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
విజయ్ దేవరకొండ కామెంట్లు
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ” కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. మీడియా సపోర్ట్ కూడా మరిచిపోలేను” అని అన్నాడు.
“నా తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. అభిమానులు సినిమా కోసం ఎంతలా మొక్కుకున్నారో, ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యూఎస్ ఆడియన్స్‌ని కూడా త్వరలో కలుస్తాను” అని విజయ్ దేవరకొండ తెలిపాడు.
జూనియర్ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు
“గురువారం విడుదలంటే నేను మొదట భయపడ్డాను. కానీ, నాగవంశీ గారు ఈ సినిమా నమ్మి గురువారం విడుదల చేశారు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. సినిమాకి నా నటనకు ఇన్ని ప్రశంసలు రావడానికి కారణం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.
“కింగ్డమ్ టీజర్‌కి వాయిస్ ఓవర్ అందించిన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు” అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
‘కింగ్డమ్’ సినిమా విజయం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని, అమెరికా ప్రేక్షకులను కలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు విజయ్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సహకారానికి కృతజ్ఞతలు.


