
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో విజయ్ దేవరకొండకు కాంతారావు స్మారక పురస్కారం లభించింది. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమా రెండవ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో విజయ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Key Points
విజయ్ దేవరకొండకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు
‘పెళ్లి చూపులు’ సినిమా రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక
అభిమానులకు, కుటుంబానికి, టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు
గద్దర్ అవార్డుల ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని వెల్లడించారు.
2014 ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్
2015 ఉత్తమ చిత్రం – రుద్రమదేవి
2016 ఉత్తమ చిత్రం – శతమానం భవతి
విజయ్ దేవరకొండకు ప్రత్యేక గౌరవం
2017 ఉత్తమ చిత్రం – బాహుబలి కంక్లూజన్
2018 ఉత్తమ చిత్రం – మహానటి
2019 ఉత్తమ చిత్రం – మహర్షి
2020 ఉత్తమ చిత్రం – అల వైకుంఠపురంలో
‘పెళ్లి చూపులు’ సినిమా విజయం
2021 ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
2022 ఉత్తమ చిత్రం -సీతారామం
ఇక ఇందులో 2016వ సంవత్సరంలో వచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘పెళ్లి చూపులు’ రెండవ ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ కావడం విశేషం. తాజాగా, ఈ విషయంపై విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా కీలక నోట్ రిలీజ్ చేశాడు. ‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో నాకు కాంతారావు స్మారక పురస్కారం రావడం చాలా గౌరవంగా ఉంది. నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు రావడం నా అదృష్టం. తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ రెండవ ఉత్తమ చిత్రంగా ఎంపికైనందుకు కూడా కృతజ్ఞుడను. ఈ సినిమా నా హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ అవార్డును నా అభిమానులదే. వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉంది. నా కుటుంబానికి, నా టీమ్‌కు, ఈ ప్రయాణంలో నడిపించినందుకు స్పెషల్ థాంక్స్’’ అని రాసుకొచ్చాడు.
విజయ్ దేవరకొండ తన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘పెళ్లి చూపులు’ సినిమా అతని హృదయానికి ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.


