|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి విజయ్‌ దేవరకొండ `కింగ్డమ్‌` మూవీ.. ఇంకా ఒక్కరోజే, ఎక్కడ చూడొచ్చంటే?

Published: 25-08-2025, 8:10 AM
ఓటీటీలోకి విజయ్‌ దేవరకొండ `కింగ్డమ్‌` మూవీ.. ఇంకా ఒక్కరోజే, ఎక్కడ చూడొచ్చంటే?

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. జులై 31న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' ఓటీటీలోకి!

2

నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 27 నుండి స్ట్రీమింగ్.

4

అన్నదమ్ముల కథాంశంతో ఆకట్టుకునే ప్రయత్నం.

కింగ్డమ్ మూవీ ఓటీటీ విడుదల తేదీ

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ చివరగా `కింగ్డమ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గత నెల ఎండింగ్‌లో(జులై 31) విడుదలైన ఈ మూవీ థియేటర్లలో మిశ్రమ స్పందన రాబట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. ఓపెనింగ్స్ భారీగానే రాబట్టుకుంది. వీకెండ్‌ వరకు సత్తా చాటిన ఈ మూవీ ఆ తర్వాత డీలా పడిపోయింది. బయ్యర్లకి కొంత నష్టాలను తీసుకొచ్చింది. కాకపోతే వరుస పరాజయాల్లో ఉన్న విజయ్‌కి మాత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. ఆయన తలెత్తుకునేలా చేసింది.

`కింగ్డమ్‌` మూవీలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించగా, ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సితార ఎంటరటైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. థియేటర్లో యావరేజ్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. మరో ఒక్క రోజులోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

కింగ్డమ్ సినిమా కథాంశం

`కింగ్డమ్‌` మూవీ నెట్‌ ఫ్లిక్స్ లోకి రాబోతుంది. ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రావడం విశేషం. మరి థియేటర్లో హిట్‌గా నిలవలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా సత్తాని చాటుతుందా? ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి.

థియేటర్ల తర్వాత ఓటీటీ ప్రయాణం

`కింగ్డమ్‌` మూవీ కథేంటంటే? విజయ్‌ దేవరకొండ, సత్యదేవ్‌ అన్నదమ్ములు. తండ్రి ఆగడాలను భరించలేక సత్యదేవ్‌ తండ్రిని హత్య చేసి పారిపోతాడు. శ్రీలంకకి వెళ్లిపోతాడు. అక్కడ తెలుగు వారు స్థానిక గోల్డ్ మాఫియా కింద వర్కర్లుగా పనిచేస్తుంటారు. గోల్డ్ స్మగ్లింగ్‌కి సహాయం చేస్తుంటారు. పారిపోయిన సత్యదేవ్‌.. శ్రీలంక తెలుగు వారి వద్ద పెరిగి, వారికి నాయకుడిగా ఎదుగుతాడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ ఇక్కడ పోలీస్‌ కానిస్టేబుల్‌గా జాబ్‌ కొడతాడు. చిన్నప్పట్నుంచి అన్న కోసం వెతుకుతుంటాడు. విజయ్‌లోని ఫైర్‌ని, తెలివిని గమనించిన ఒక అధికారి  స్పైగా మారుస్తాడు. శ్రీలంకలో జరుగుతున్న ఈ స్మగ్లింగ్‌కి సంబంధించిన సమాచారం అందించాలని పంపిస్తాడు. అంతేకాదు అక్కడే మీ అన్న ఉన్నాడని చెబుతాడు. మరి విజయ్‌ శ్రీలంకకి వెళ్లి ఏం చేశాడు? తన అన్నని ఎలా కలుసుకున్నాడు? అక్కడ మాఫియాని అంతం చేసేందుకు తాను ఏం చేశాడనేది సినిమా కథ.

చివరగా, ‘కింగ్డమ్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. థియేటర్లలో సత్తా చాటలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో విజయం సాధిస్తుందేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.