|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’కు వీరమల్లు టెన్షన్.. డైలమాలో మూవీ టీమ్!

Published: 06-05-2025, 8:46 AM
విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’కు వీరమల్లు టెన్షన్.. డైలమాలో మూవీ టీమ్!

మే 30న విడుదల కానున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాకు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా పోటీగా మారింది. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఢీకొట్టుకోవడం వల్ల ‘కింగ్డమ్’ టీమ్ డైలమాలో పడింది.

Key Points

1

విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’ మే 30న విడుదలకు సిద్ధం.

2

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ ‘కింగ్‍డమ్’కు సవాల్.

4

అమెజాన్ ప్రైమ్ వీడియో ‘వీరమల్లు’ను మే 30న రిలీజ్ చేయాలని కోరుతోంది.

‘కింగ్‍డమ్’కు ‘వీరమల్లు’ సవాల్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్‍డమ్’ సినిమా ఈ మే 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లకు కూడా మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఓ సాంగ్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. అయితే, కిండ్‍గమ్‍కు ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ టెన్షన్ పట్టుకుంది. ప్రమోషన్లు చేసేందుకు కూడా క్లారిటీ లేక డైలమా నెలకొన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..

హరి హర వీరమల్లు సినిమా కోసం కాస్త పెండింగ్‍లో ఉన్న షూటింగ్‍ను పూర్తి చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే సెట్స్‌లోకి వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. దీంతో హరి హర వీరమల్లు చిత్రం మే 30వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇదే జరిగితే కింగ్‍డమ్ వాయిదా పడకతప్పదు. ఒకవేళ జూన్‍ను వీరమల్లు ఎంపిక చేసుకుంటే ఊరట లభిస్తుంది.

రిలీజ్ డేట్ క్లారిటీ కోసం ఎదురుచూపులు

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్‍పై క్లారిటీ కోసం కింగ్‍డమ్ టీమ్ ప్రస్తుతం వేచిచూస్తోంది. త్వరగా స్పష్టత వస్తే ప్రమోషన్లను ప్లాన్ చేసుకోవాలని ఆలోచిస్తోంది. విడుదల తేదీని వీరమల్లు మేకర్లు మరో వారంలోగా ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తికాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను అంచనా వేసుకొని రిలీజ్‍ను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మే 30న వీరమల్లు వస్తే వాయిదా వేసుకోవడం తప్ప కింగ్‍డమ్‍కు మరో ఆప్షన్ ఉండదు.

హరి హర వీరమల్లు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమాను మే 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేయాలని మూవీ టీమ్‍ను ఆ ప్లాట్‍ఫామ్ ఒత్తిడి చేస్తోందనే టాక్ కూడా టాలీవుడ్‍ వర్గాల్లో తిరుగుతోంది. జూన్ రెండో వారం అనే ఆలోచన వీరమల్లు టీమ్‍లో ఉన్నా.. స్ట్రీమింగ్ విండో ప్లానింగ్ కోసం మే 30నే థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్రైమ్ వీడియో అడుగుతోందట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

ప్రమోషన్స్‌పై ప్రభావం

కింగ్‍డమ్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ స్పై యాక్షన్ ప్యాక్డ్ మూవీగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు.

పీరియాడిక్ యాక్షన్ మూవీ హరి హర వీరమల్లు నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాక.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.

‘హరి హర వీరమల్లు’ రిలీజ్ తేదీపైనే ‘కింగ్‍డమ్’ భవిష్యత్తు ఆధారపడి ఉంది. వీరమల్లు మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని ‘కింగ్‍డమ్’ టీమ్ ఆశిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.