
హైదరాబాద్ లో జరిగిన దిల్ రాజు డ్రీమ్స్ ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా కోసం 16 వేల మంది ఆడిషన్స్ కి వచ్చారని, అందులో తాను ఎంపికయ్యారని తెలిపారు. ఈ అవకాశం తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని వివరించారు.
Key Points
16 వేల మందిలో విజయ్ దేవరకొండ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లో అవకాశం దక్కించుకున్నారు.
ఆడిషన్ ప్రక్రియలో ఆయన అనుభవించిన ఆందోళన, సంతృప్తి గురించి వివరించారు.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా ఔత్సాహికలకు అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని విజయ్ అభిప్రాయపడ్డారు.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లో విజయ్ దేవరకొండ ప్రయాణం
శనివారం హైదరాబాద్ లో జరిగిన దిల్ రాజు డ్రీమ్స్ ప్రారంభోత్సవంలో హీరో విజయ్ దేవరకొండ సినీ పరిశ్రమలో తన ప్రస్థానం గురించి మాట్లాడాడు. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా కోసం 16 వేల మంది ఆడిషన్స్ కు వస్తే.. అందులో నుంచి సెలెక్ట్ అయ్యానని విజయ్ చెప్పాడు. ఆ సినిమా తన జీవితాన్ని ఎలా మార్చేసిందో గుర్తు చేసుకున్నాడు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కోసం ఆడిషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తాను సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే తపన గురించి స్టేజ్ పై మాట్లాడాడు. “కాస్టింగ్ కాల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి 2011 లేదా 2012లో ఐడిల్ బ్రైన్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడున్నంతగా సోషల్ మీడియా ఉండేది కాదు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తీస్తున్న విషయం నాకు బాగా గుర్తుంది. ఆయన హ్యాపీడేస్ (2007) తీసినప్పుడు నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను ఇంకా నటుడిని కావాలని అనుకోలేదు. ఈ కాస్టింగ్ కాల్ చూసే సమయానికి డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లోకి రావాలని ఏడాదిగా ప్రయత్నిస్తున్నాను’’ అని విజయ్ దేవరకొండ అన్నాడు.
ఆడిషన్ అనుభవం: ఆందోళన, సంతృప్తి
“దరఖాస్తు చేసేటప్పుడు, ఆడిషన్ చేసేటప్పుడు నేను ఎలా ఫీలయ్యానో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ పాత్ర రావడానికి నాకు ఆరు నెలలు పట్టింది. అప్పుడు నేను అనుభవించిన ఆందోళన ప్రతిరోజూ ఉదయం లేవడానికి ఒక కారణాన్ని ఇచ్చింది. సంతృప్తిగా అనిపించింది. ఆప్షన్లు లేకపోవడం కంటే ఇది మంచిది. ఈ సినిమా కోసం 16 వేల దరఖాస్తులు వచ్చాయి. నేను, నవీన్ పొలిశెట్టి సహా పన్నెండు మంది ఎంపికయ్యాం. ఆ సినిమా మా జీవితాల్లో పెద్ద పాత్ర పోషించింది” అని విజయ్ తెలిపాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకునే ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పించేందుకు నిర్మాత దిల్ రాజు డ్రీమ్స్ ను ప్రారంభించారు. దీని నుంచి కనీసం ఒక్కరైనా ప్రయోజనం పొందారని తెలుసుకోవడం కంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదని, అలాంటి అవకాశం ఎంత ముఖ్యమో తనకు తెలుసునని విజయ్ అన్నాడు.
దిల్ రాజు డ్రీమ్స్ పై విజయ్ అభిప్రాయం
‘‘ దిల్ రాజు డ్రీమ్స్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మందికి ఆశాకిరణం అనిపించి ఉంటుందని నాకు తెలుసు. దీని వల్ల మీ కలల్లో ఒకటి నెరవేరినా సరిపోతుందని అనుకుంటున్నాను. అయిదేళ్ల తర్వాత మీలో ఎవరో ఒకరు ఈ రోజు నాలా స్టేజ్ మీద మాట్లాడితే నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది’’ అని విజయ్ చెప్పాడు.
విజయ్ 2011లో నువ్విలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అతని రెండవ చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012 లో విడుదలైంది. రీసెంట్ గా ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 సినిమాల్లో నటించాడు. త్వరలోనే కింగ్ డమ్, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
విజయ్ దేవరకొండ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా తన జీవితంలో ఎంతో ప్రభావం చూపిందని, దిల్ రాజు డ్రీమ్స్ వంటి అవకాశాలు ఔత్సాహికలకు ఎంతో ముఖ్యమని తెలిపారు.


