
టాలీవుడ్‌లో రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, డ్రగ్స్ వాడకంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కెరీర్ విజయం ద్వారా ‘హై’ అనుభూతి పొందాలని ఆయన సూచించారు.
Key Points
విజయ్ దేవరకొండ డ్రగ్స్ వాడకంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కెరీర్ సక్సెస్ ద్వారా 'హై' రావాలని సూచించారు.
కష్టపడి పనిచేయడం, ఇతరులకు సహాయపడటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ముఖ్యమని వివరించారు.
డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు.
విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటుడు నువ్విలా మూవీలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా సైడ్ క్యారెక్టర్ పాత్రలో నటించి మెప్పించాడు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి పాత్రలో అవకాశం దక్కించుకున్నాడు. 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2017 మొదట్లో ద్వారక అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం ఆశించినంతా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో సినిమాతో తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో అండ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పెద్ద స్టార్‌గా నిలిచాడు.
డ్రగ్స్‌పై హెచ్చరిక
2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావెతో మన ముందుకు వచ్చి ఆ సినిమాతో నిరాశ పరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చూశాడు. 2018 నవంబర్ 17న టాక్సీవాలాతో మరొక్క చక్కని విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు.
కెరీర్ సక్సెస్‌కు ప్రాధాన్యత
అలాగే యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు కూడా. ఇదంతా పక్కన పెడితే.. అయితే విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్‌లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హై రావాల్సింది మత్తు పదార్థాలతో కాదు.. కెరీర్ సక్సెస్‌తో అని చెప్పుకొచ్చాడు. కష్టపడి పనిచేస్తే, ఇతరులకు సహాయం చేస్తే, మన మనీతో మనం ఖర్చు చేసుకున్నప్పుడు, మంచి వర్కౌట్ చేస్తే హై వస్తది. ఇవన్నీ మనకు పనికి వచ్చేవి’ అని చెప్పుకొచ్చాడు. కానీ డ్రగ్స్ వంటివి లైఫ్‌ను నాశనం చేసేటివి అని జనాలకు సలహా ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ యువతకు మార్గదర్శకం చేస్తూ, కష్టపడి పనిచేసి, ఆరోగ్యకరమైన జీవనశైలితో విజయం సాధించాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు.


