|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గర్ల్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపాలనుంది.. అదే అన్నిటికీ మించి ఉంటుంది.. నిర్మొహమాటంగా చెప్పిన హీరో విజయ్ దేవరకొండ

Published: 26-07-2025, 3:41 AM
గర్ల్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపాలనుంది.. అదే అన్నిటికీ మించి ఉంటుంది.. నిర్మొహమాటంగా చెప్పిన హీరో విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ప్రేయసితో ఎక్కువ సమయం గడపాలని, అది తనకు ఎంతో ముఖ్యమని తెలిపాడు.

Key Points

1

విజయ్ దేవరకొండ తన ప్రేయసితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాడు.

2

గత కొన్ని సంవత్సరాలలో తన ప్రియమైన వారితో సరిపడా సమయం గడపలేకపోయినందుకు విజయ్ విచారం వ్యక్తం చేశాడు.

4

విజయ్ తన వ్యక్తిగత జీవితం గురించి నిర్మొహమాటంగా మాట్లాడాడు.

విజయ్ దేవరకొండ యొక్క వ్యక్తిగత జీవితం

తెలుగు సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాది సూపర్ హిట్ పెయిర్. వీరి జోడీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నా డేటింగ్ రూమర్స్ తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ కూడా ఇచ్చారు.

తాజాగా మరోసారి విజయ్, రష్మిక డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ నిర్మోహమాటంగా చేసిన కామెంట్సే. తాజాగా సినిమా వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి నిర్మొహమాటంగా చెప్పాడు. తన ప్రేయసితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ” రిలేషన్‌షిప్స్ అన్నింటికీ మించి ఉంటాయి. వాటికి మించి ఏముంటుంది. నేను గత 2 సంవత్సరాలుగా జీవితాన్ని గడపడం నేర్చుకుంటున్నాను. అంతకు ముందు నేను ఇలా ఉండేవాన్ని కాదు. గత 2-3 సంవత్సరాలుగా నా జీవితం ఎలా సాగిందో నాకు నచ్చలేదు” అని అన్నాడు.

రష్మిక మందన్నాతో డేటింగ్ రూమర్స్

“అమ్మ, నాన్న, గర్ల్‌ఫ్రెండ్ , ఫ్రెండ్స్‌తో తగినంత సమయం గడపలేదు. అకస్మాత్తుగా ఒకరోజు నేను ఇదంతా రియలైజ్ అయ్యాను. మళ్లీ అలాంటి ఫీలింగ్ నాకు ఉండకూడదు. ఇప్పుడు నా ప్రజల కోసం సమయం కేటాయించడానికి నేను ప్రయత్నాలు చేస్తాను. నా స్నేహితుల కోసం సమయం కేటాయిస్తాను. నేను మా అమ్మ, నాన్న, నా రిలేషన్‌షిప్స్ (గర్ల్‌ఫ్రెండ్) కోసం సమయం కేటాయిస్తాను” అని విజయ్ తెలిపాడు.

దీంతో విజయ్ దేవరకొండ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లోవాళ్లతో పాటు గర్ల్‌ఫ్రెండ్‌తో టైమ్ స్పెండ్ చేయలేదని విజయ్ దేవరకొండ చెప్పడంతో ఆ ప్రేయసి రష్మికనే అని, రష్మిక ను చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్

ఇంతకుముందు గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా విజయ్ దేవరకొండ తన కోస్టార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు విజయ్ దేవరకొండ. “నేను ఇంతకు ముందు ఓ కోస్టార్‌తో డేటింగ్ చేశాను. నా వయస్సు 35. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? మనమందరం ఏదో ఒక సమయంలో (పెళ్లి చేసుకోవాలి) సెలెక్ట్ చేసుకోవాలి కదా” అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలో విజయ్ డేటింగ్ చేసింది, చేస్తుంది రష్మికనే ఆన్‌లైన్‌లో తెగ ప్రచారం జరిగింది. ఇకపోతే 2018లో వచ్చిన గీత గోవిందం సినిమాలో విజయ్, రష్మిక కలిసి నటించారు. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ మూవీలో వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుంచి వీరిమధ్య డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ తన ప్రేయసితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత జీవితంపై అతని నిర్మొహమాట వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.